For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9300 తగ్గిన బంగారం ధర

|

బంగారం ధరలు నేడు (జూన్ 24, 2021 గురువారం) స్వల్పంగా తగ్గాయి. దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోనూ ధరలు క్షీణించాయి. ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు రూ.47,000 దిగువకు క్షీణించింది. వెండి ఉదయం రూ.67,600 స్థాయికి పడిపోయినప్పటికీ, ఆ తర్వాత కాస్త పుంజుకుంది. అయినప్పటికీ నష్టాల్లోనే ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1780 డాలర్ల దిగువకు, వెండి 26 డాలర్లకు పైన ట్రేడ్ అయింది. గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే పసిడి రూ.9300 వరకు తక్కువగా ఉంది. వెండి ఆల్ టైమ్ గరిష్టంతో రూ.12వేల వరకు తక్కువగా ఉంది. బంగారం ధర కరోనా సెకండ్ వేవ్‌కు ముందు రూ.44వేల దిగువకు పడిపోయిన విషయం తెలిసిందే.

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో నేటి సాయంత్రం సెషన్లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.91.00 (-0.19%) క్షీణించి రూ.46,981.00 వద్ద ట్రేడ్ అయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.128.00 (-0.27%) నష్టపోయి రూ.47260.00 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ జూలై అతి స్వల్పంగా 13.00 (-0.02%) క్షీణించి రూ.67919.00 వద్ద ట్రేడ్ అయింది. సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ.47.00 (-0.07%) క్షీణించి రూ.68940.00 వద్ద ట్రేడ్ అయింది.

Gold cheaper by Rs 9,300, prices continue to fall today

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 3.30 (0.19%) డాలర్లు క్షీణించి 1779.10 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ దాదాపు స్థిరంగా ఉంది. 0.022 (0.08%) డాలర్లు ఎగిసి 26.133 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

English summary

ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9300 తగ్గిన బంగారం ధర | Gold cheaper by Rs 9,300, prices continue to fall today

Gold prices have been on the decline lately. Gold has once again slipped below Rs 47,000 per 10 grams and silver is also cheaper today by up to Rs 400 per kg.
Story first published: Thursday, June 24, 2021, 22:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X