For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్లోబల్ చిప్ షార్టేజ్: క్రెడిట్, డెబిట్ కార్డులు పోగొట్టుకుంటే కష్టమేనా?

|

డెబిట్, క్రిడెట్ కార్డుదారులకు అలర్ట్. సాధారణంగా డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు పోగొట్టుకుంటే ఒకటి నుండి మూడు రోజుల్లో ఇస్తాయి. కొన్ని బ్యాంకులు ఒక్కరోజులోనే డెబిట్ కార్డులు జారీ చేస్తాయి. క్రెడిట్ కార్డు కోసం అయితే అన్ని వెరిఫికేషన్‌లు పూర్తి కాగానే బ్యాంకులు కార్డును జారీ చేస్తాయి. డెబిట్, క్రెడిట్ కార్డులు పోతే బ్లాక్ చేసి రెండు, మూడు రోజుల్లో బ్యాంకుల నుండి తిరిగి ఈజీగా పొందవచ్చు. క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే బ్యాంకులు పూర్తి సంతృప్తి చెందాకే ఆ కార్డును జారీ చేస్తాయి. అయితే ఇప్పుడు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు పోగొట్టుకుంటే వెంటనే బ్లాక్ చేసినప్పటికీ, రెండు మూడు రోజుల్లో పొందటం తేలిక కాదని నిపుణులు అంటున్నారు.

అందుకే అంత సులభం కాదు

అందుకే అంత సులభం కాదు

ఇక ముందు మూడు నాలుగు రోజుల్లోనే డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు పొందడం అంత సులభం కాదని అంటున్నారు. ఇందుకు కారణం ఉందని అంటున్నారు. గ్లోబ‌ల్ టెక్నాల‌జీ మార్కెట్‌లో చిప్స్ కొర‌త నెల‌కొంది. కార్డులు తయారుచేసే కంపెనీలు ప్రస్తుతం తీవ్రమైన చిప్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏటా 300 కోట్ల మేర డెబిట్, క్రెడిట్ కార్డులు తయారవుతున్నాయి. అయితే దాదాపు 90 శాతం నగదురహిత ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. డిజిటల్ చెల్లింపుల్లో 40 శాతం నుండి 60 శాతం వరకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల మద్దతు కావాలి.

చిప్స్ కార్యకలాపాల నిలిపివేత

చిప్స్ కార్యకలాపాల నిలిపివేత

కరోనాతో గత ఏడాది చిప్ తయారీ కంపెనీలు కార్యకలాపాలు నిలిపివేశాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా లర్న్ ఫ్రమ్ హోమ్ పెరిగింది. దీంతో కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్స్‌కు డిమాండ్ పెరిగింది. చిప్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ వస్తువుల కోసం డిమాండ్ పెరిగింది. దీంతో చిప్స్‌కు కొరత ఏర్పడటంతో సెమీ కండక్టర్ పరిశ్రమ దెబ్బతిన్నది. పలు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలూ భారీగా పెరిగాయి. వీటి కొర‌త వ‌ల్ల డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్స్ త‌యారీ భారం కానుంది. ఈ ప‌రిస్థితి వ‌చ్చే ఏడాది వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని మొబైల్ పేమెంట్స్ సంస్థలు వెల్లడించాయి.

90 శాతం నగదురహిత ట్రాన్సాక్షన్స్

90 శాతం నగదురహిత ట్రాన్సాక్షన్స్

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది దాదాపు 3 బిలియన్ల డెబిట్, క్రెడిట్ కార్డులను తయారు చేస్తున్నాయి కంపెనీలు. దాదాపు 90 శాతం మేర నగదురహిత ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కార్డులను తయారుచేసే కంపెనీలు ప్రస్తుతం తీవ్ర చిప్ కొరతను ఎదుర్కొంటున్నాయి. చెల్లింపు కార్డుల వాణిజ్య సంస్థ, మొబైల్ చెల్లింపుల సంస్థలు చిప్స్ కొరతను నివారించడానికి, సరఫరా పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

English summary

గ్లోబల్ చిప్ షార్టేజ్: క్రెడిట్, డెబిట్ కార్డులు పోగొట్టుకుంటే కష్టమేనా? | Global chip shortage could affect your bank cards

After causing long waiting lists for smartphones, PCs and gaming consoles, the global shortage of chips is now threatening to imperil the supply of another pretty indispensable item.
Story first published: Sunday, June 27, 2021, 16:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X