For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కార్యకలాపాలు పెరుగుతున్నాయి.. రికవరీ వేగవంతం: జీడీపీ ఎంత ఉండవచ్చునంటే

|

2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ మైనస్ 7.7 శాతంగా నమోదు కావొచ్చునని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కీలక తయారీ, సేవా రంగాలు కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన నేపథ్యంలో వృద్ధిరేటు మైనస్ 7.7 శాతానికి పడిపోవచ్చని తొలి జాతీయ ఆదాయ ముందస్తు అంచనాల్లో జాతీయ గణాంక కార్యాలయం(NSO) తెలిపింది. ఆర్థిక వ్యవస్థలోని దాదాపు అన్నిరంగాలు క్షీణతను నమోదు చేస్తున్నప్పటికీ వ్యవసాయ, గ్యాస్, విద్యుత్ సరఫరా వంటివి వృద్ధిని కనబరుస్తున్నాయని తెలిపింది.

<strong>వింతగా ఉంది: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆశ్చర్యం! నెటిజన్ల చురకలు ఇలా..</strong>వింతగా ఉంది: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆశ్చర్యం! నెటిజన్ల చురకలు ఇలా..

వేగవంత రికవరీ

వేగవంత రికవరీ

2011-12 ధరల ఆధారంగా రియల్ జీడీపీ లేదా జీడీపీ విలువ 2020-21లో

రూ.134.40 లక్షలకోట్ల స్థాయికి, 2019-20లో రూ.145.66 లక్షల కోట్లుగా ఉంది. ఇక జీడీపీ వృద్ధిరేటును 2020-21కిగాను మైనస్ 7.7 శాతంగా అంచనా వేస్తున్నామని, 2019-20లో ఇది 4.2 శాతంగా ఉందని NSO తెలిపింది. FY21లో తలసరి నికర జాతీయ ఆదాయం రూ.1,26,968గా ఉండవచ్చునని NSO అంచనా వేసింది. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటున్న సంకేతాలకు NSO అంచనాలు అద్దం పడుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. ప్రభుత్వ చర్యలతో పరిశ్రమలు కోలుకుంటున్నాయి.

అభివృద్ధి డౌన్

అభివృద్ధి డౌన్

గనులు, క్వారీలు, వాణిజ్యం, హోటల్స్, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్ కాస్టింగ్, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్ కాస్టింగ్ సహా అనేక సేవా రంగాల్లో అభివృద్ధి రేటు గణనీయంగా తగ్గిపోతుందని అంచనా వేసింది. FY21లో వ్యవసాయ రంగం 3.4 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని, అంతకుముందు ఇది నాలుగు శాతంగా ఉంది.

ఆర్థిక కార్యకలాపాలపై ఆధారపడి

ఆర్థిక కార్యకలాపాలపై ఆధారపడి

FY21లో భారత జీడీపీపై వివిధ సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి. ఆర్బీఐ మైనస్ 7.5 శాతం, ప్రపంచ బ్యాంకు మైనస్ 9.6 శాతం, ఐఎంఎఫ్ మైనస్ 10.3 శాతం, మూడీస్ మైనస్ 10.6 శాతంగా అంచనా వేశాయి. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ, కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపట్టే చర్యలపై వృద్ధి రేటు ఆధారపడింది.

English summary

కార్యకలాపాలు పెరుగుతున్నాయి.. రికవరీ వేగవంతం: జీడీపీ ఎంత ఉండవచ్చునంటే | GDP estimates: Industries showing signs of recovery, says Niti Aayog VC

Niti Aayog Vice Chairman Rajiv Kumar on Friday said industries are showing signs of recovery and fiscal measures announced by the government are projected to offset the impact of the COVID-19 pandemic.
Story first published: Saturday, January 9, 2021, 9:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X