కరోనా మహమ్మారి దెబ్బతో భారత జీడీపీ 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసింది. ఇది ప్రతి ఒక్కరికీ హెచ్చరిక అని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ప్రస్తుత పరిస్థితిలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న అమెరికా, ఇటలీలతో పోల్చుకుంటే భారత్ దారుణంగా పతనమైందన్నారు. అనారోగ్యంతో ఉన్నప్పుడే రోగికి చికిత్స అవసరమని, కానీ అరోగ్యం క్షీణించిన తర్వాత అవసరం లేదన్నారు.

జీడీపీ సంకోచం ఆందోళనకరం
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ సంకోచం ఆందోళనకరంగా ఉందని రాజన్ అన్నారు. ఈ గణాంకాలు ప్రభుత్వం, బ్యోరోక్రసీని వారి ఆత్మసంతృప్తి నుండి బయటపడేసి ఆర్థవంతమైన కార్యకలాపాల దిశగా తీసుకు వెళ్తుందని భావిస్తున్నానని అభిప్రాయపడ్డారు. నిర్మాణం, తయారీ రంగం, హోటల్స్, ట్రాన్సుపోర్ట్ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో వృద్ధి రేటు రికార్డ్ స్థాయిలో పతనమైంది. ఈ మేరకు ఆయన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లింక్డిన్‌లో పోస్ట్ చేశారు.

భవిష్యత్తు కోసం వనరుల ఆదా స్వీయ ఓటమి
కరోనా నేపథ్యంలో ప్రభుత్వం అందించిన ఉపశమనం స్వల్పమేనని రాజన్ అన్నారు. భవిష్యత్తు కోసమంటూ నేడు వనరులను ఆదా చేసే వ్యూహం స్వీయ ఓటమికి కిందకు వస్తుందన్నారు. పేదలకు ఉచిత రేషన్, చిన్న, మధ్యతరహా కంపెనీలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులకు క్రెడిట్ హామీ ఇచ్చారని, కానీ భవిష్యత్తు ఉద్దీపనల కోసం ఈ రోజే మరింత చేయాల్సిన ప్రభుత్వం వనరులను ఆదా చేస్తోందని, ఇది సరికాదని, స్వీయ ఓటమి కిందకు వస్తుందన్నారు.

పేషెంట్‌కు అవసరమున్నప్పుడే చికిత్స కావాలి
ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడే చికిత్స అవసరమని, కానీ అవసరం లేనప్పుడు కాదని రఘురాం రాజన్ అన్నారు. MGNREGAకు మరిన్ని కేటాయింపులు, పేద వర్గాలకు మరింత నగదు బదలీ, వివిధ ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన బకాయిల క్లియరెన్స్ వేగవంతం చేయడం అవసరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు తగినంత నిధులు సమకూర్చడం అవసరమన్నారు. కరోనా కారణంగా అమెరికా, ఇటలీ ఎక్కువగా దెబ్బతిన్నాయని, మన ఆర్థిక వ్యవస్థ అక్కడి కంటే ఎక్కువగా చితికిపోయిందన్నారు. అనారోగ్యంతో ఉన్నప్పుడే చికిత్స అవసరమైనట్లుగా కరోనాతో పోరాడుతున్నప్పుడే ఉపశమనం అవసరమని, ఇప్పుడు ఆర్థిక ఉద్దీపన మన ఆర్థిక వ్యవస్థకు టానిక్ వంటిదన్నారు. రోగి ఆరోగ్యం క్షీణించాక చికిత్స చేసి లాభం లేదని, అలాగే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నాక ఉద్దీపన ప్రభావం ఉండదన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications