For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Adani Enterprises FPO: అదానీ సంచలన నిర్ణయం.. అందుకే FPO రద్దు చేసినట్లు ప్రకటన..

|

Adani Enterprises FPO: అసాధ్యం అనుకున్న FPOను విజయవంతంగా అదానీ విజయవంతంగా పూర్తి చేశాడని అందరూ భావించాం. అయితే అంతా పూర్తైన తర్వాత ఛైర్మన్ గౌతమ్ అదానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే రూ.20,000 కోట్ల ఎఫ్పీవోను రద్దు చేయటం.

అదానీ ఎంటర్ ప్రైజెస్..

అదానీ ఎంటర్ ప్రైజెస్..

హిండెన్ బర్గె ఆరోపణల నేపథ్యంలోనూ విజయవంతంగా ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ ను అదానీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ గౌతమ్ అదానీ పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే FPOతో కొనసాగడం నైతికంగా సరైనది కాదని బోర్డు గట్టిగా భావించినట్లు అదానీ వెల్లడించారు. ఈ విషయంలో ముందుకు వెళ్లడం నైతికంగా సరైనది కాదని బోర్డు నిర్ణయించిందని తెలిపారు.

అదానీ ఏమన్నారంటే..

తనకు తన ఇన్వెస్టర్ల ఆసక్తి చాలా ముఖ్యమైనదని అదానీ ఈ సందర్భంగా తెలిపారు. మిగిలిన విషయాలన్నీ దీని తర్వేతే నిలుస్తాయని స్పష్టం చేశారు. అందుకే ఇన్వెస్టర్లను సంభావ్య నష్టాల నుంచి రక్షించాలనే ఉద్ధేశ్యంతోనే తాము FPOని ఉపసంహరించుకున్నట్లు అదానీ తెలిపారు. అయితే ప్రజల నుంచి అధిక మద్దతు పొందడం ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు గౌతమ్ అదానీ పేర్కొన్నారు. మార్కెట్ స్థిరీకరించబడిన తర్వాత మూలధన మార్కెట్ వ్యూహాన్ని సమీక్షిస్తామని చెప్పారు. ఇన్వెస్టర్లకు ధన్యవాదాలు తెలిపారు.

 క్రెడిట్ సూయిస్ నిర్ణయం..

క్రెడిట్ సూయిస్ నిర్ణయం..

మార్జిన్ లోన్‌ల కోసం క్రెడిట్ సూయిస్ అదానీ కంపెనీల బాండ్లను కొలేటరల్‌గా స్వీకరించడాన్ని నిలిపివేసినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ ఫిబ్రవరి 1న 26 శాతం మేర నష్టపోయి రూ.2,180.20 వద్ద ట్రేడింగ్ ముగించింది. ఇదే క్రమంలో అదానీ పోర్ట్స్ 20 శాతం నష్టపోగా, అంబుజా సిమెంట్స్‌ 16.56 శాతం క్షీణించింది. ఏసీసీ సిమెంట్స్ కంపెనీ షేర్లు సైతం నిన్న 6 శాతం వరకు నష్టాన్ని చూశాయి.

వారం గడుస్తున్నప్పటికీ..

వారం గడుస్తున్నప్పటికీ..

అదానీ గ్రూప్ కంపెనీ షేర్లలో పతనం మెుదలై దాదాపుగా వారం గడుస్తున్నప్పటికీ షేర్ల ధరల క్షీణత కొనసాగుతూనే ఉంది. గ్రూప్ కంపెనీల్లో అమ్మకాల ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.ఈ పరిస్థితులు ప్రధానంగా దేశీయ రిటైల్ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

English summary

Adani Enterprises FPO: అదానీ సంచలన నిర్ణయం.. అందుకే FPO రద్దు చేసినట్లు ప్రకటన.. | Gautam Adani Withdraws Adani Enterprises FPO descided to return money

Gautam Adani Withdraws Adani Enterprises FPO descided to return money
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X