For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gautam Adani: గౌతమ్ అదానీకి ఎదురుదెబ్బ.. మెగా పోర్టుకు అడ్డంకులు.. అసలేమైంది..?

|

Gautam Adani: దేశంలో ఎదురులేని వ్యాపారవేత్తగా గౌతమ్ అదానీ ఎదుగుతున్నారు. అయితే ఆయనకు తొలిసారిగా ఎదురుదెబ్బ తగిలింది. అవును అదానీకి చెందిన విజింజమ్ మెగా పోర్ట్ ప్రాజెక్ట్ కు కేరళలోని మత్స్యకారులు పెద్ద అండంకిగా మారారు. పోర్ట్ అభివృద్దిపై నిరసనలు ప్రారంభించి ప్రధాన రహదారిపై బైఠాయించటం పెద్ద అడ్డంకిగా మారింది.

ప్రాజెక్టుకు అడ్డంకులు..

ప్రాజెక్టుకు అడ్డంకులు..

ఆసియా బిలియనీర్ చేపడుతున్న మెుదటి కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ విలువ దాదాపు 900 మిలియన్ డాలర్లుగా ఉంది. నిరసనకారులు ధర్నాకు ఏర్పాట్లు చేసుకోగా.. ప్రధాని నరేంద్ర మోడీ అధికార పార్టీ, హిందూ సంఘాల సభ్యులతో సహా ఓడరేవు మద్దతుదారులు డేరాలను ఏర్పాటు చేశారు. మరోపక్క కోర్టు ఆదేశించినా పోలీసులు ఆందోళనకారులపై చర్యలు తీసుకోవడం లేదు. అడ్డంకులు లేకుండా నిర్మాణాలు చేయాలని న్యాయస్థానం ఆదేశించినా.. పోలీసులు మాత్రం మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగొచ్చని భయపడుతున్నారు.

అదానీ గ్రూప్ ఏమంటోందంటే..

అదానీ గ్రూప్ ఏమంటోందంటే..

ఓడరేవుకు భారీ వాహనాలను పంపాలని అదానీ గ్రూప్ యోచిస్తోంది. ఈ వారం కోర్టు వాహనాల రాకపోకలను ఆపకూడదని చెప్పింది. అక్టోబర్‌లో పోర్టు నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన వాహనాలను వెనక్కి తిప్పి పంపాల్సి వచ్చింది. ప్రాజెక్ట్ చట్టాలకు లోబడి ఉందని.. తీరం కోతకు గురికావటానికి ప్రాజెక్ట్ బాధ్యతకు సంబంధించిన ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టివేసింది. అవసరమైతే ఆందోళనకారులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సైతం సిద్ధంగా ఉన్నారు.

 ఆందోళనలకు కారణం..

ఆందోళనలకు కారణం..

2015 డిసెంబరు నుంచి పోర్టు నిర్మాణం వల్ల తీరానికి గణనీయమైన నష్టం వాటిల్లిందని నిరసన నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో దాదాపు 56 వేల మంది మత్స్యకారుల జీవనోపాధి స్తంభించిందని నిరసనకారులు అంటున్నారు. సముద్ర పర్యావరణ వ్యవస్థపై ఓడరేవు అభివృద్ధి ప్రభావంపై స్వతంత్ర అధ్యయనాలు నిర్వహించి నిర్మాణాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించాలని నిరసనకారులు కోరుతున్నారు.

 అదానీకి ఈ ప్రాజెక్ట్ ముఖ్యం..

అదానీకి ఈ ప్రాజెక్ట్ ముఖ్యం..

ప్రపంచంలోని ప్రధాన షిప్పింగ్ మార్గాలలో విజింజం ప్రత్యేకమైనదని అదానీ అభివర్ణించారు. ఒక ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్‌గా శ్రీలంక నుంచి వ్యాపారాన్ని పొందేందుకు ఇది మంచి స్థానంగా ఉంది. ఇక్కడ ప్రధాన ప్రత్యర్థి చైనా పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భారీగా పెట్టుబడి పెట్టింది. దీంతో పాటు సింగపూర్‌, దుబాయ్‌ నుంచి వాణిజ్యం కూడా ఈ పోర్టు ద్వారా సులభతరం కానుంది.

ట్రాన్స్‌షిప్‌మెంట్ అంటే ఏమిటి..?

ట్రాన్స్‌షిప్‌మెంట్ అంటే ఏమిటి..?

కంటైనర్‌లను ప్రధాన వాణిజ్య మార్గాలలోని మెయిన్‌లైన్ షిప్‌ల నుంచి ఇతర వాణిజ్య మార్గాల్లోని చిన్న, ఫీడర్ షిప్‌లకు బదిలీ చేయడానికి అదానీ అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. పాయింట్-టు-పాయింట్ షిప్పింగ్‌పై ఆధారపడటం కంటే మరింత పొదుపుగా, అనువైన హబ్-అండ్-స్పోక్ నెట్‌వర్క్‌ను రూపొందించడం ప్రాజెక్ట్ లక్ష్యంగా ఉంది.

English summary

Gautam Adani: గౌతమ్ అదానీకి ఎదురుదెబ్బ.. మెగా పోర్టుకు అడ్డంకులు.. అసలేమైంది..? | gautam adani transshipment project in vizhinjan kerala facing issues

gautam adani transshipment project in vizhinjan kerala facing issues
Story first published: Wednesday, November 23, 2022, 15:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X