For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gowtham Adani: ఒక్కరోజులో 19 వేల కోట్లు పెరిగిన అదానీ సంపద.. ముఖేష్ అంబానీ పరిస్థితి

|

Gowtham Adani: ప్రపంచంలోని టాప్- 10 బిలియనీర్ల జాబితాలో పెద్ద మార్పు జరిగింది. ఇందులో భారత పారిశ్రామికవేత్తలైన గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీలు ప్రపంచంలోని టాప్-10 సంపన్నుల జాబితాలో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఈ జాబితాలో అదానీ ఆరవ స్థానంలో ఉండగా.. అంబానీ 10వ స్థానానికి పరిమితమయ్యారు. ఇదే సమయంలో ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ చాలా కాలం పాటు జెఫ్ బెజోస్‌ను అధిగమించారు.

భారీగా లాభపడ్డ అదానీ..

భారీగా లాభపడ్డ అదానీ..

ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ సుమారు రూ.19 వేల కోట్లు పెరిగి 98.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇలా మార్కెట్ క్యాప్ పెరగడంతో టాప్-10 జాబితాలో ఆరో స్థానానికి చేరుకున్నారు. 2022లో సంపాదన పరంగా.. ప్రపంచంలోని రెండవ టాప్ బిలియనీర్‌లను పక్కన పెడితే అదానీ తన సంపదను భారీగానే పెంచుకున్నారని చెప్పుకోవాలి. ఇటీవలి కాలంలో తన 60వ పుట్టిన రోజు సందర్భంగా రూ.60 వేల కోట్లను దాతృత్వానికి అందిస్తున్నట్లు సంచలన ప్రకటన కూడా చేశారు.

10వ స్థానానికి పరిమితమైన ముఖేష్ అంబానీ..

10వ స్థానానికి పరిమితమైన ముఖేష్ అంబానీ..

ప్రపంచంలోని టాప్-10 కుబేరుల జాబితాలో రెండో భారతీయ పారిశ్రామికవేత్తగా నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ మరోసారి 10వ స్థానానికి పడిపోయారు. అయితే.. ఫోర్బ్స్ జాబితాను పరిశీలిస్తే అంబానీ సంపద గత 24 గంటల్లో దాదాపు రూ. 10 వేల కోట్లు పెరిగిందని తెలుస్తోంది. దీంతో ఆయన ఆస్తుల విలువ 92.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తాజాగా.. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ షేర్లలో పెరుగుదల కారణంగా దేశంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు.

 కొనసాగుతున్న ఎలాన్ మస్క్ ఆధిపత్యం..

కొనసాగుతున్న ఎలాన్ మస్క్ ఆధిపత్యం..

ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఇప్పటికీ టెస్లా, స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ కొనసాగుతున్నారు. మస్క్ సంపద దాదాపు రూ. 50 వేల కోట్లు పెరగగా.. అతని నికర విలువ 234.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది కాకుండా.. ఇతర బిలియనీర్ల గురించి మాట్లాడినట్లయితే.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ జాబితాలో నాల్గవ స్థానంలో కొనసాగుతున్నారు. అతని నికర విలువ 124.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. లారీ పేజ్ 101.4 బిలియన్ డాలర్లతో ఐదవ స్థానానికి చేరుకున్నారు.

 వారెన్ బఫెట్ పరిస్థితి ఏమిటంటే..

వారెన్ బఫెట్ పరిస్థితి ఏమిటంటే..

టాప్-10 బిలియనీర్ల జాబితాలో ఉన్న ఇతర కుబేరుల గురించి మాట్లాడుకున్నట్లయితే.. లారీ ఎలిసన్ 97.6 బిలియన్ డాలర్ల నికర విలువతో ఏడవ స్థానంలో, సెర్గీ బ్రిన్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. బ్రిన్ గత 24 గంటల్లో 4.3 బిలియన్ డాలర్ల లాభం ఆర్జించారు. దీనితో అతని సంపద 97.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇక ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆయన కేవలం 96.6 బిలియన్ డాలర్ల సంపదతో తొమ్మిదో స్థానానికి పరిమితమయ్యారు.

English summary

Gowtham Adani: ఒక్కరోజులో 19 వేల కోట్లు పెరిగిన అదానీ సంపద.. ముఖేష్ అంబానీ పరిస్థితి | Gautam Adani's wealth increased by 19000 crores in just one day ambani stood in 10th place in billionaires list

Indian business tycoons Gautam Adani mukesh ambani stood in billionaires top 10 list
Story first published: Saturday, June 25, 2022, 17:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X