For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Adani News: బంగ్లాదేశ్‌కు పాకిన అదానీ వ్యాపారాలు.. భారీగా పెరిగిన స్టాక్ ఇదే.. శ్రీలంకలో సైతం..

|

Adani: ఇప్పటి వరకు ఆసియాలో సంపన్నుడిగా ఉన్న అదానీ దేశంలో అనేక వ్యాపారాలను హస్తగతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ కు తన వ్యాపారాలను విస్తరించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఆ దేశ ప్రధానిని కలిశారు.

విద్యుత్ సరఫరా..

గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ అదానీ పవర్ బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా చేయనుంది. ఆసియాలోని అత్యంత సంపన్న బిలియనీర్ గౌతమ్ అదానీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను ఢిల్లీలో కలిశారు. ఈ భేటీ అనంతరం గౌతమ్ అదానీ ట్విట్టర్ పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో కొన్ని విషయాలను వెల్లడించారు.

అదానీ ప్లాన్ ఇదే..

అదానీ ప్లాన్ ఇదే..

అదానీ గ్రూప్ ఈ సంవత్సరం తూర్పు భారతదేశంలోని బొగ్గు ఆధారిత ప్లాంట్ నుంచి బంగ్లాదేశ్‌కు విద్యుత్ ఎగుమతి ప్రారంభించాలని యోచిస్తోంది. జార్ఖండ్‌లోని 1600 మెగావాట్ల గొడ్డ పవర్ ప్రాజెక్ట్, బంగ్లాదేశ్‌కు అంకితమైన ట్రాన్స్‌మిషన్ లైన్ 16 డిసెంబర్ 2022న దేశంలోని విజయ్ దివస్ ద్వారా ప్రారంభించబడుతోందని గౌతమ్ అదానీ వెల్లడించారు. ఈ లైన్ ద్వారా ఆ దేశానికి విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది.

శ్రీలంకలో పెట్టుబడులు..

శ్రీలంకలో పెట్టుబడులు..

గౌతమ్ అదానీ చేపడుతున్న ఈ తాజా ప్రాజెక్ట్ పొరుగు దేశాల్లో పెరుగుతున్న భారత ప్రభావానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదానీ గ్రూప్ శ్రీలంకలో కూడా విస్తృతంగా పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత సంపన్న బిలియనీర్. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. గౌతమ్ అదానీ విలువ 141 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్న బిలియనీర్ గా ఆసియా నుంచి నిలిచి కొత్త రికార్డును సృష్టించి భారత కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు.

అదానీ పవర్ స్టాక్..

అదానీ పవర్ స్టాక్..

ఈ వార్తల నేపథ్యంలో అదానీ పవర్ స్టాక్ ధర మంగళవారం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి షేరు ధర 5 శాతం పెరిగి రూ.410కి చేరుకుంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం రూ.1,58,057.36 కోట్లుగా ఉంది. దీనికితోడు దేశంలో అనేక పవర్ ప్లాంట్లను దక్కించుకునే పనిలో కంపెనీ ఉండటంతో స్టాక్ రానున్న కాలంలో మరింత పెరగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

English summary

Adani News: బంగ్లాదేశ్‌కు పాకిన అదానీ వ్యాపారాలు.. భారీగా పెరిగిన స్టాక్ ఇదే.. శ్రీలంకలో సైతం.. | gautam adani met Bangladesh pm Sheikh Hasina in Delhi over power business

gautam adani met Bangladesh pm Sheikh Hasina in Delhi over power business
Story first published: Tuesday, September 6, 2022, 17:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X