For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాత కార్లకు యమ క్రేజీ.. రూ.4 లక్షల లోపు వెహికిల్స్‌కు డిమాండ్..

|

పాత కారుకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కరోనా వల్ల జనం కూడా సొంత వెహికల్​ ఉండాలని అనుకుంటున్నారు. జీతాల కోతతోపాటు, కొంత మందికి ఉద్యోగాలే పోవడంతో ఖర్చులు తగ్గించుకోవడం తప్పనిసరయింది. 2020-21 ఫైనాన్షియల్​ ఇయర్‌లో కొత్త కార్ల అమ్మకాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 27 శాతం పడిపోయాయి. డీలర్​షిప్స్​ వద్ద రిజిస్ట్రేషన్స్​ డేటా దీనిని వెల్లడిస్తోంది.

 పాత కార్లకు క్రేజ్..

పాత కార్లకు క్రేజ్..

2021-22 ఫైనాన్షియల్​ ఇయర్‌లో పాత కార్ల అమ్మకాలు కొంచెం అటూ ఇటూగా 40 నుంచి 45 లక్షల లెవెల్​లో ఉంటాయని క్రిసిల్​ చెబుతోంది. కిందటి ఫైనాన్షియల్​ ఇయర్ మొదటి క్వార్టర్‌లో అమ్మకాలు చెప్పుకోదగ్గ రీతిలో లేవు. కరోనా మహమ్మారి కంటే ముందు నుంచే పాత కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. పాత కార్ల సేల్స్​ ఏటా 15 శాతం చొప్పున పెరుగుతున్నాయని, 2024 నాటికి ఈ అమ్మకాలు ఏకంగా 49 బిలియన్​ డాలర్లకు చేరతాయని నోమురా అంచనా వేసింది. ఖర్చు తగ్గించుకునేందుకు కొత్త వాటి కంటే పాత కార్ల వైపే ఎక్కువ మంది చూస్తున్నారు.

 రూ.4 లక్షల లోపు కార్లు

రూ.4 లక్షల లోపు కార్లు

కొత్త కార్లు కొనే వారి సంఖ్య తగ్గడంతో డిమాండ్​కి తగినన్ని పాత కార్లు మార్కెట్లో లేవు. రూ. 4 లక్షల లోపు పాత కార్ల రేట్లు కిందటి ఫైనాన్షియల్​ ఇయర్‌లో సగటున 10 శాతం పెరిగాయి. సెకండ్​ హాండ్​ మార్కెట్‌లో ఈ సెగ్మెంట్లో ఎక్కువ అమ్మకాలు జరుగుతాయని ఇక్రా లిమిటెడ్​ వైస్​ ప్రెసిడెంట్​ ఆశిష్​ మోదాని చెప్పారు. 2020-21లో కొత్త వెహికల్స్​ అమ్మకాలు బాగా తగ్గిపోవడంతో మార్కెట్లోకి వచ్చే పాత కార్ల సంఖ్య తగ్గిపోయింది. గతేడాది ఎక్స్చేంజ్​ కూడా బాగా తగ్గాయి. పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​ కంటే పర్సనల్​ మొబిలిటీనే ఇష్టపడే వారు పాత కార్లపై దృష్టి పెడుతున్నారని మహీంద్రా ఫస్ట్​ ఛాయిస్​ వీల్స్​ సీఈవో అశుతోష్​ పాండే తెలిపారు.

ఈ కార్లు అంటేనే క్రేజ్

ఈ కార్లు అంటేనే క్రేజ్

పాత కార్లను కొనాలనుకునే వాళ్లలో ఎక్కువ మంది ఎంట్రీ లెవెల్​ హ్యాచ్​బాక్స్​ ఇష్టపడుతున్నారు. మారుతి సుజుకి స్విఫ్ట్​, డిజైర్​, వేగన్​ ఆర్​, బాలెనో మోడల్స్​ను, హ్యుండాయ్​ ఐ-20, ఐ-10. మహీంద్రా స్కార్పియో మోడల్స్​ వైపు మొగ్గుచూపుతున్నారని ఓఎల్​ఎక్స్​, మహీంద్రా ఫస్ట్​ ఛాయిస్​ వెల్లడిస్తున్నాయి. 5,6 ఏళ్లలో చూస్తే ఏడాది గ్రోత్​ చాలా బాగుందని కార్​ వాలే శర్మ తెలిపారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే డిమాండ్​ 30 శాతం పెరిగిందన్నారు. కిందటి ఫైనాన్షియల్​ ఇయర్​ చివరి క్వార్టర్లో తమ ప్లాట్​ఫామ్​ చూసే వారి సంఖ్య 48 శాతం పెరిగిందని వెల్లడించారు.

డిమాండ్ 133 శాతం..

డిమాండ్ 133 శాతం..

పాత కార్లకు డిమాండ్​ 133 శాతం పెరిగితే, సప్లయ్​ మాత్రం 120 శాతమేనని ఓఎల్​ఎక్స్​ ఆటో సీఈఓ అమిత్​ కుమార్​ చెబుతున్నారు. సప్లయ్​లో 18 నుంచి 20 శాతం షార్టేజ్​ ఉందని కార్​వాలే సీఈఓ బన్వరి లాల్​ శర్మ తెలిపారు. పాత కారు కొనాలనుకునే కొంత మంది నిర్ణయాలను కూడా కరోనా మహమ్మారి ప్రభావితం చేసింది. కోవిడ్​-19 కారణంగా సొంత వెహికల్​ కొనాలనుకుంటున్నట్లు 65 శాతం మంది తమ సర్వేలో వెల్లడించినట్లు ఇండియన్ ​బ్లూబుక్​ తెలిపింది. కరోనాకి భయపడకపోతే కారు కొనేవాళ్లమే కాదని పాత కార్లను కొన్న వారిలో 29 శాతం మంది చెప్పినట్లు ఈ సర్వే పేర్కొంది.

 పాత కార్ల అమ్మకాలు వాటా 80 శాతం

పాత కార్ల అమ్మకాలు వాటా 80 శాతం

పాత కార్ల అమ్మకాల మార్కెట్లో 80 శాతం వాటా ఉందని చెప్పుకుంటున్న ఓఎల్​ఎక్స్​ సేల్స్​ ఏకంగా 130 శాతం పెరిగాయి. లాక్​డౌన్​ ఆంక్షలు ఎత్తివేసిన వెంటనే రూరల్​ ఏరియా నుంచి డిమాండ్​ జోరందుకుందని, ఆ తర్వాతే అర్బన్​ ఏరియాల నుంచి డిమాండ్​ పెరిగిందని కుమార్​ చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ సేల్స్​ రెట్టింపు అయినట్లు మరో కంపెనీ స్పిన్నీ వెల్లడించింది. కంపెనీ ఇటీవలే 65 మిలియన్​ డాలర్ల ఫండింగ్​ తెచ్చుకుంది. సెకండ్​ హ్యాండ్​ లగ్జరీ కార్ల సేల్స్​ కూడా పెరుగుతున్నాయి. లగ్జరీ కార్ల డిమాండ్​ 45 శాతం దాకా ఎక్కువైందని బిగ్​ బాయ్​ టాయ్జ్​ చెబుతోంది. కండ్​ హ్యాండ్​ కార్ల మార్కెట్​పై దృష్టి పెడుతున్నాయి.

English summary

పాత కార్లకు యమ క్రేజీ.. రూ.4 లక్షల లోపు వెహికిల్స్‌కు డిమాండ్.. | full demand on old cars

full demand on old cars. rs.4 lakh low cars are demanded.
Story first published: Saturday, April 10, 2021, 13:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X