For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్రోల్ లీటర్ రూ.100 క్రాస్ ఇక్కడే: ఈ నెలలో 8సార్లు జంప్

|

పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (మే 14, శుక్రవారం) పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. ఈ నెలలో లేదా మే 4వ తేదీ నుండి ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు పెరిగాయి. ఇక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 పైకి చేరుకుంది. ఈ రోజు లీటర్ పెట్రోల్ పైన 29 పైసలు, లీటర్ డీజిల్ పైన 34 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోల్ ధర రూ.92.34 కి, లీటర్ డీజిల్ ధర రూ.82.95కి చేరుకుంది.

పెట్రోల్ ఇక్కడ రూ.100 క్రాస్

పెట్రోల్ ఇక్కడ రూ.100 క్రాస్

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.34, లీటర్ డీజిల్ రూ.82.95గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.98.65, డీజిల్ రూ.90.11, చెన్నైలో పెట్రోల్ రూ.94.09గా ఉంది. ఇక, మధ్యప్రదేశ్‌లోని రేవా ప్రాంతంలో లీటర్ పెట్రోల్ రూ.102.69కి చేరుకుంది. షాదోల్‌లో రూ.102.68, బాలాఘాట్‌లో రూ.102.56, సాంతాలో రూ.102.36, పన్నా 102.28, చింద్వారాలో రూ.102.29, అలీరాజ్‌పూర్‌లో రూ.102.15, బుర్హాన్‌పూర్‌లో రూ.102.14గా ఉంది.

రూ.100 దాటింది ఇక్కడే

రూ.100 దాటింది ఇక్కడే

ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 క్రాస్ చేసింది. మహారాష్ట్రలోని పర్బానీలో లీటర్ పెట్రోల్ రూ.101. 03, అమ్రావతిలో రూ.100.13, బుల్దానాలో రూ.100.27, రత్నగిరిలో రూ.100.06, నాందెడ్‌లో రూ.100.87గా ఉంది.

ఇక రాజస్థాన్‌లోని గంగానగర్‌లో రూ.103.28, హనుమాన్‌గర్‌లో రూ.102.63, బికనీర్‌లో, జైసల్మేర్‌లో రూ.101.39గా ఉంది. దుంగాపూర్‌లో రూ.100.49, జున్‌జునులో రూ.100.45, బార్మర్‌లో రూ.100.44గా ఉంది.

పన్నులు

పన్నులు

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పైన కేంద్ర పన్నులు రూ.32.98 కాగా, రాష్ట్ర ప్రభుత్వ సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ రూ.19.55గా ఉంది. డీజిల్ విషయానికి వస్తే లీటర్ పైన ఎక్సైంజ్ డ్యూటీ రూ.31.83 కాగా, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ రూ.10.99గా ఉంది. వీటితో పాటు డీలర్ కమిషన్ పెట్రోల్ పైన రూ.2.6, డీజిల్ పైన రూ.2గా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరలను బట్టి మారుతాయి.

English summary

పెట్రోల్ లీటర్ రూ.100 క్రాస్ ఇక్కడే: ఈ నెలలో 8సార్లు జంప్ | Fuel rates up for eighth time: petrol, diesel prices cross Rs 100 in these cities

Continuing its upward trend, petrol rates shot up by 29 paise whereas diesel prices went up by 34 paise on Friday. This is the eighth hike since May 4.
Story first published: Friday, May 14, 2021, 15:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X