For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

18వ రోజు స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు: చమురు సేల్స్ భారీగా డౌన్

|

పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 18వ రోజు స్థిరంగా ఉన్నాయి. నేడు (మే 3, సోమవారం) యథాతథంగా ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకారం న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.40, లీటర్ డీజిల్ ధర రూ.80.73గా ఉంది. సెస్‌తో పాటు పలు రాష్ట్రాల్లో వ్యాట్‌ను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.90.40, డీజిల్ రూ.80.73, ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.96.83, లీటర్ డీజిల్ రూ.87.81, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.92.43, లీటర్ డీజిల్ రూ.85.75, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.90.62, లీటర్ డీజిల్ రూ.83.61గా ఉంది. చమురురంగ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం సంస్థలు అంతర్జాతీయ చమురు మార్కెట్లో ధరలను బట్టి దేశీయ చమురురంగ కంపెనీలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి.

రాజస్థాన్‌లో 20 శాతం డౌన్

రాజస్థాన్‌లో 20 శాతం డౌన్

కరోనా మహమ్మారి కర్ఫ్యూ, ఆంక్షల కారణంగా రాజస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ డిమాండ్ క్షీణించిందని ప్రభుత్వరంగ చమురు కంపెనీలు చెబుతున్నాయి. కేవలం రాజస్థాన్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా డిమాండ్ తగ్గింది. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోన్న విషయం తెలిసిందే. కేవలం రాజస్థాన్‌లోనే పెట్రోల్ సేల్స్ 20 శాతం, డీజిల్ డిమాండ్ 30 శాతం క్షీణించాయి.

ఏడాదికి సేల్స్ ఎంతంటే

ఏడాదికి సేల్స్ ఎంతంటే

రాజస్థాన్‌లో దాదాపు 7000 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ పెట్రోల్ బంకుల ద్వారా ప్రతి సంవత్సరం 390 కోట్ల లీటర్ల డీజిల్, 65 కోట్ల లీటర్ల పెట్రోల్‌ను విక్రయిస్తారు. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది సేల్స్ పడిపోయినట్లు చెబుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి లాక్ డౌన్, కరోనా ఆంక్షలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకునే వెసులుబాటును కల్పించింది కేంద్ర ప్రభుత్వం.

స్థానిక లాక్ డౌన్

స్థానిక లాక్ డౌన్

కరోనా కట్టడికి విధిస్తోన్న స్థానిక లాక్‌డౌన్‌లు, ప్రయాణ ఆంక్షలతో పెట్రోల్, డీజిల్‌తో పాటు విమాన ఇంధన విక్రయాలు కూడా తగ్గినట్లు ఇక్రా తెలిపింది. దీంతో ఇంధన కంపెనీలు ఉత్పత్తి తగ్గించినట్లుగా ఇటీవలి నివేదికలో పేర్కొంది. ముందుముందు మరిన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించే అవకాశమున్నందున ఇంధన విక్రయాలు మరింత తగ్గవచ్చునని ఇక్రా భావించింది.

English summary

18వ రోజు స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు: చమురు సేల్స్ భారీగా డౌన్ | Fuel prices remain unchanged for 18th straight day, sales down 20 percent due to curfew

Petrol and diesel prices remained unchanged for the 18th consecutive day on Monday, as oil marketing companies kept rates on hold.
Story first published: Monday, May 3, 2021, 10:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X