For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Fuel Prices: స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు

|

పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (జూన్ 24, శుక్రవారం) స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మే 21వ తేదీన లీటర్ పెట్రోల్ పైన రూ.8, లీటర్ డీజిల్ పైన రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అప్పటి నుండి కూడా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ధరలను స్థిరంగా కొనసాగిస్తున్నాయి. కేంద్రం ఎక్స్చైజ్ డ్యూటీని తగ్గించిన తర్వాత ఢిల్లీలో రూ.9.5, లీటర్ డీజిల్ రూ.7 తగ్గింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.109.66, లీటర్ డీజిల్ రూ.97.82గా ఉంది.

చమురు మార్కెటింగ్ కంపెనీలు తమ ఇంధన అవసరాలలో 80 శాతం దిగుమతుల ద్వారా వస్తున్నాయి. అయితే కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల చమురు మార్కెటింగ్ సంస్థలకు లీటర్ పెట్రోల్ పైన రూ.13.08, డీజిల్ పైన రూ.24.09 నష్టం వాటిల్లుతోంది. దీంతో చమురు మార్కెటింగ్ సంస్థలు కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతున్నాయి.

Fuel Prices: petrol, diesel rates did not change for the straigh 34th day

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్‌ను విక్రయించలేమని ప్రయివేటు పెట్రోల్ పంప్స్ రిటైల్ డీలర్స్ కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల తేల్చి చెప్పారు. ఈ అంశంపై కేంద్ర చమురు శాఖ జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర చమురు శాఖకు జియో-బీపీ, నయారా ఎనర్జీ, షెల్ తదితర రిటైల్ డీలర్లతో కూడిన భారత పెట్రోలియం పరిశ్రమ సమాఖ్య (FIPI) జూన్ 10వ తేదీన లేఖ రాసింది. FIPI ప్రభుత్వరంగ సంస్థలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థలను తన సభ్యులుగానే భావిస్తుంటుంది. లీటర్ డీజీల్‌పై రూ.20 నుండి రూ.25, లీటర్ పెట్రోల్‌పై రూ.14 నుండి రూ.18 నష్టానికి విక్రయించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

English summary

Fuel Prices: స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు | Fuel Prices: petrol, diesel rates did not change for the straigh 34th day

Petrol and diesel prices have held steady so far on June 24, 2022, the latest price notification issued by fuel retailers shows.
Story first published: Friday, June 24, 2022, 8:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X