For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Petrol price today - స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు

|

పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం(సెప్టెంబర్ 20) స్థిరంగా ఉన్నాయి. పదిహేను రోజుల క్రితం (ఆదివారం) స్వల్పంగా తగ్గాయి. అప్పుడు దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ పైన 19 పైసలు తగ్గి రూ.101.19, లీటర్ డీజిల్ పైన 15 పైసలు తగ్గి రూ.88.77 నుండి రూ.88.62గా ఉంది. నాటి నుండి ధరల్లో మార్పులేదు. పెట్రోల్ ధరలు చివరిసారి పెరిగింది మాత్రం జూలై 17వ తేదీ. డీజిల్ ధరలు జూలై 15వ తేదీ నుండి పెరగలేదు. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఇటీవల తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరుగంటలకు ధరలను సవరిస్తాయి. చివరిసారి జూలై నెలలో లీటర్ పెట్రోల్ పైన 30 పైసలు పెరిగింది. జూలైలో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి. గత ఆగస్ట్ నెలలో ధరలు ఒక్కసారి పెరగలేదు. పైగా డీజిల్, పెట్రోల్ ధరలు పలుమార్లు తగ్గాయి. మే నెలలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధరల పెరుగుదల నిలిచిపోయింది. ఆ తర్వాత పలుమార్లు పెరిగినప్పటికీ, జూలై మిడిల్ నుండి పెరుగుదలలేదు.

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.19, లీటర్ డీజిల్ రూ.88.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.107.26, డీజిల్ రూ.96.19గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.98.96, డీజిల్ రూ.93.26, కోల్‌కతాలో పెట్రోల్ రూ.101.62, డీజిల్ రూ.91.71, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.105.35, డీజిల్ రూ.96.85గాఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు రూ.110 క్రాస్ చేశాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అమరావతి, తిరువనంతపురంలలో సెంచరీ దాటింది.

 Fuel price today: Petrol, Diesel Prices Unchanged for 15th Day

పెట్రోల్ ధర రూ.100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్‌కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురం, పాట్నా, భువనేశ్వర్ తదితర నగరాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. పెట్రోల్ ధరలో 60 శాతం, డీజిల్ ధరలో 54 శాతం పన్నులు. కేంద్రం పెట్రోల్ పైన రూ.32.90, డీజిల్ పైన రూ.31.80 వేస్తుంది. ఇక ఆయా రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి. దీంతో ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు మారుతుంటాయి. రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక వ్యాట్ విధిస్తుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు శుక్రవారం 75 డాలర్లకు చేరుకుంది. మెక్సికో యూఎస్ గల్ఫ్ కంపెనీలు రెండు కరికేన్స్ అనంతరం చమురు ఉత్పత్తిని తిరిగి ప్రారంభించాయి. బ్రెంట్ క్రూడ్ ధర అంతకుముందువారం 70 డాలర్ల దిగువన ఉండగా, ప్రస్తుతం 75 డాలర్ల పైన ఉంది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ బ్యారెల్‌కు 71.97 డాలర్లు పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో త్వరలో ఇక్కడ కూడా ప్రభావం పడవచ్చునని, ధరలు పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. గత వారంలో బ్యారెల్‌కు 4 నుండి 6 డాలర్లు పెరిగింది. అయినప్పటికీ ఇక్కడ పెరగలేదు. కానీ త్వరలో పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.

కాగా, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు సెప్టెంబర్ 1 నుండి పెరిగాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయి. ఇందులో భాగంగా ఇప్పుడు ధరలను సవరించాయి. నాన్-సబ్సిడీ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(LPG) సిలిండర్ ధరలు రూ.25 పెంచాయి. నాన్-సబ్సిడీ 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇప్పుడు రూ.884.50కు పెరిగింది. గత రెండు వారాల్లో ఇది రెండో పెరుగుదల. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన, 15వ తేదీన సవరిస్తాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.

English summary

Petrol price today - స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు | Fuel price today: Petrol, Diesel Prices Unchanged for 15th Day

Petrol and diesel prices remained unchanged across the four metros, for the 15th consecutive day, on Monday, September 20, 2021.
Story first published: Monday, September 20, 2021, 7:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X