For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎక్కువ డబ్బులు ఇస్తే ... ఏం చేసారో చూడండి!

|

అతి సర్వర్త వర్జయేత్ అన్నారు పెద్దలు. అంటే ఏదైనా సరే... అవసరానికంటే అధికం చేస్తే దాని ప్రయోజనం సున్నా. పైగా వ్యతిరేక ఫలితాలు ఎదురవుతాయని చరిత్ర చెప్పింది. అందుకే ఎవరైనా కొంచెం ఎక్కువ చేస్తే ... వీడికి మూడిందిరా అంటాం. అలాగే ఇటీవల ప్రపంచ స్టార్టుప్ రంగంలోనూ ఇలాంటి సంఘటన జరిగింది. దాని ఫలితం కూడా అచ్ఛం మన పెద్దలు చెప్పినట్టే జరిగింది. అదేమిటంటే.... అనగనగా జపాన్ దేశం లో ఒక మహా కుబేరుడు ఉన్నాడు.

ఆయన పేరు మసాయాషి సొన్. సాఫ్ట్ బ్యాంకు అనే ప్రపంచంలోనే అతి పెద్ద పెట్టుబడి సంస్థల్లో ఒకటైన కంపెనీకి ఓనర్. అయన రెండేళ్ల క్రితం $100 బిలియన్ డాలర్ల (సుమారు రూ 7,00,000 కోట్లు) తో ఒక విజన్ ఫండ్ ను ఏర్పాటు చేశారు. ప్రపంచంలో వేగంగా దూసుకుపోయే విజయవంతమైన స్టార్టుప్ కంపెనీలకు పెద్ద మొత్తంలో పెట్టుబడిని అందించేందుకు దీనిని ఏర్పాటు చేశారు. వెంటనే ఉబెర్, వి వర్క్ వంటి అమెరికా స్టార్టుప్ దిగ్గజాలతో పాటు మన దేశంలో ఆన్లైన్ లో హోటల్ గదులను బుక్ చేసుకొనే కంపెనీ ఓయో రూమ్స్ లో కూడా భారీగా పెట్టుబడులు పెట్టారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ది న్యూ యార్క్ టైమ్స్ ప్రచురించిన ఒక కథనాన్ని ఫాలో కావాలి. అందులోని కొన్ని ముఖ్యాంశాలు మీకోసం.

జగన్‌కు షాక్... ఆంధ్రప్రదేశ్‌కు బ్యాడ్ న్యూస్జగన్‌కు షాక్... ఆంధ్రప్రదేశ్‌కు బ్యాడ్ న్యూస్

ఎరక్క పోయి ఇరుక్కున్న...

ఎరక్క పోయి ఇరుక్కున్న...

ఢిల్లీ కి చెందిన ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ సిటీ సబర్బన్ ఏరియాలో ఒక 20 గదుల హోటల్ ను నిర్వహిస్తుండేవారు. దాంతో ఆయన సంతోషంగా ఉన్నారు. మరీ గొప్పగా కాకపోయినా ... నిర్వహణ ఖర్చులు పోను కొంత మిగిలేది. అప్పుడే మన ఓయో రూమ్స్ ఎంటర్ అయ్యింది. ఈ హోటల్ మొత్తం మేం నిర్వహిస్తాం. మాకు ఇచ్చేయండి అని అడిగింది. ఎన్ని బుకింగ్స్ వస్తున్నాయో సంబంధం లేకుండా నెలకు కచ్చితంగా రూ 7,00,000 చెల్లిస్తానని అగ్రిమెంట్ రాసిచ్చింది. అయితే, ప్రస్తుత హోటల్ ను తమ నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలనీ, కొత్త ఫర్నిచర్, రగ్గులు కొనిపించింది. హోటల్ కు ఓయో బ్రాండింగ్ చేసేసింది. ఇందుకోసం యజమానికి రూ 6,00,000 ఖర్చు అయ్యింది. హమ్మయ్య ఇకపై నాకు దిగులు లేదు అని యజమాని ఊపిరి పీల్చుకొన్నారు. ఓయో నిర్వహణ మొదలైంది. గదుల అసలు అద్దె కంటే చాలా తక్కువ ధరకే ఓయో ఆఫర్స్ పెట్టింది. ఐన గదులు నిండలేదు. దానికి నష్టాలు షురూ. ఆరు నెలలైనా గడవక ముందే యజమానికి ఇబ్బందుకు మొదలయ్యాయి. ఓయో చెప్పినట్లుగా పేమెంట్ చేయటం లేదు. అనుకున్నట్లు కార్పొరేట్ క్లయింట్ లు రావటం లేదు. బదులుగా పెళ్లి కాని జంటలు హోటల్ లో రూమ్స్ బుక్ చేస్తున్నారు. హోటల్ యజమాని ఇప్పుడు నెలకు సుమారు రూ 1,50,000 నష్టపోతున్నారు. బిల్లు చెల్లించలేదని హోటల్ కు ఇటీవలే పవర్ కట్ చేసారు. హోటల్ ప్రాపర్టీ ఓనర్ ఈ మిలిటరీ రిటైర్డ్ ఆఫీసర్ ను వెంటనే ఖాళీ చేయాలనీ డిమాండ్ చేశారు. ఇది కేవలం ఒక్క రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కు వచ్చిన ఇబ్బంది కాదు. దేశంలో ... ఆ మాటకు వస్తే ప్రపంచంలో చాలా మంది స్టార్టుప్ కంపెనీలు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవటంతో రోడ్డున పడుతున్నారని ది న్యూ యార్క్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది.

కారణం ఇదే...

కారణం ఇదే...

లాభాల మాట పక్కన పెట్టి ... ఎంత ఖర్చు అయినా సరే ఏదోలా వినియోగదారుని ఆకర్షించాలి. వారితో తమ సేవలు కొనుగోలు చేసేలా చేయాలనే స్టార్టుప్ కంపెనీల ఫౌండర్ల ఆలోచన ధోరణితో ఈ పరిస్థితి తలెత్తుతోంది. పెట్టుబడి దారులు ఇస్తున్నారు కదా అని .... మంచి నీళ్ల కంటే అధికంగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అలవికాని ప్రామిస్ లు చేస్తున్నారు. ఆన్లైన్ అంటేనే ఆఫర్లు అనే పరిస్థితి కల్పించారు. రూ 1000 విలువైన ప్రొడెక్టు లేదా సేవను రూ 300 కు విక్రయించారు. దీంతో ఆదాయం కంటే నష్టాలు అధికంగా ఉంటున్నాయి. ఇందుకు ఉబెర్, వి వర్క్, ఓయో రూమ్స్ వంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వీటన్నిటిలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిన సాఫ్ట్ బ్యాంకు వంటి సంస్థలు కూడా నిండా మునిగిపోయే స్థితి దాపురిస్తోంది. అందుకే, ఎవరికైనా... అవసరానికంటే ఎక్కువ మొత్తంలో డబ్బు ఇవ్వకూడదు అన్నమన పెద్దల మాట గుర్తు పెట్టుకుంటే మంచిది.

ఉబెర్ నష్టాలు... వి వర్క్ కష్టాలు..

ఉబెర్ నష్టాలు... వి వర్క్ కష్టాలు..

ప్రపంచంలోనే అత్యంత విలువైన స్టార్టుప్ కంపెనీగా పేరు తెచ్చుకొన్న ఉబెర్ ... పబ్లిక్ ఇష్యూ కు వెళ్లేసరికి బొక్క బోర్లా పడింది. ఇటీవల ఈ కంపెనీ 1.4 బిలియన్ డాలరు (రూ 9,800 కోట్ల ) నష్టాలు ప్రకటించింది. వి వర్క్ లో చాలా అవకతవకలు జరిగాయి. అందుకు దాని ఫౌండర్ అండ్ సీఈఓ ను బయటకు నెట్టేయాల్సి వచ్చింది. 48 బిలియన్ డాలర్ల విలువైన ఈ కంపెనీ ప్రస్తుతం 8 బిలియన్ డాలర్ల కు పతనం అయ్యింది. దీంతో సాఫ్ట్ బ్యాంకు దీనిని చక్కదిద్దే పనిలో పడింది. ఉబెర్ ఫౌండర్ ను కూడా తప్పించాల్సి వచ్చింది. ఇందులో తప్పు కేవలం స్టార్టుప్ కంపెనీలదే కాదు. వాటికి లెక్క పత్రం లేకుండా ... ఎంత పడితే అంత వాల్యుయేషన్ ఇచ్చి మరీ పెట్టుబడి పెట్టిన ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ కాపిటల్ కంపెనీలది కూడా. వాటి బిజినెస్ మోడల్స్ అసలు దీర్ఘకాలంలో ఎప్పటికైనా లాభాలు తీసుకు రాగలవా లేదా అన్న కనీస సూత్రాలను కూడా ఘనతికెక్కిన పెట్టుబడి సంస్థలు పట్టించుకోలేదు. దాని ఫలితమే ఇప్పుడు స్టార్టుప్ కంపెనీలకు నష్టాలు... వాటిని వెనకేసుకొచ్చిన పెట్టుబడి దారులకు కష్టాలు.

సమర్థులను పట్టించుకోవచ్చు కదా...

సమర్థులను పట్టించుకోవచ్చు కదా...

పెద్ద పెద్ద బిజినెస్ స్కూల్స్ లో చదివారనో, బిజినెస్ ప్లాన్ ను ఆకర్షణీయంగా చెప్పారనో, మరేదో కారణంతో లాభాల మాట లేని స్టార్టుప్ కంపెనీలకు భారీ నిధులు అందించిన పెట్టుబడి సంస్థలను తప్పుపట్టాల్సిందే. సమర్థులు, తమ జీవితాలను ఫణంగా పెట్టి కొత్త పద్దతి లో పూర్తి స్థాయి సొంతంగా తమ కాళ్ళ మీద నిలబడే వ్యూహాలతో కంపెనీలను స్థాపించిన ఫౌండర్ల కు మాత్రం కనీస పెట్టుబడి దొరకదు. ఎందుకంటే వాళ్ళు పెద్ద బ్యాక్ గ్రౌండ్ లేనివారు. ఇప్పటికైనా సమర్థవంతమైన స్టార్టుప్ కంపెనీలకు కనీస పెట్టుబడిని అందించి సమాజం లో నిజమైన మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తే అందరికి మంచిదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

English summary

ఎక్కువ డబ్బులు ఇస్తే ... ఏం చేసారో చూడండి! | From Oyo to Uber, how SoftBank's $100 billion has left the startup ecosystem weaker

For five years, Sunil Solankey, a retired captain in the Indian army, had run the 20-room Four Sight Hotel in a New Delhi suburb. Business was steady, but he longed to make the establishment a destination for lucrative business travelers.
Story first published: Thursday, November 14, 2019, 11:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X