A Oneindia Venture

అమెరికాలో ఉద్యోగం పోగొట్టుకుని ఇండియాకు వచ్చిన టెకీలకు భారీ షాక్, జీతాల కోతలు చూసి భోరున ఏడుస్తూ..

From Dollars to Rupees: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు భారతీయుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ముఖ్యం ఇండియా నుంచి అమెరికాకు ఉద్యోగానికి వెళ్లిన టెకీల పరిస్థితి దయనీయంగా మారింది.అగ్రరాజ్యం H-1B వీసాపై కఠిన రూల్స్ అమలుచేయడంతో అక్కడకు వెళ్లిన లక్షలాది మంది భారతీయుల కలలు కల్లలుగా మారిపోతున్నాయి. ఉద్యోగాల నుంచి కంపెనీలు తీసేస్తుండటంతో మళ్లీ ఇండియాకు తిరిగిరాక తప్పడం లేదు.

ట్రంప్ నిర్ణయాలతో అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోంది. టెక్ కు కేరాఫ్ అడ్రస్ అయిన సిలికాన్ వ్యాలీలో టాప్ కంపెనీలు లేఆప్స్ బాట పడుతున్నాయి. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి, దూసుకువస్తున్న ఆర్థికమాంద్య ప్రభావంతో ప్రముఖ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వేలాది మంది భారతీయులు అమెరికాను వదిలి ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నారు. ఇక్కడే ఏదో ఓ కంపెనీలో జాయిన్ అవుతున్నారు.

Indian techies salary cut US to India salary drop IT professionals returning to India reverse migration salary impact from 100K to 10LPA Indian engineers US return NRI techies salary issues tech workers pay cut India US return job market India salary gap India vs USA IT job trends 2025 Indian returnees job challenges 2025

అయితే అమెరికా నుంచి భారతదేశానికి తిరిగి వస్తున్న ఎన్నారై టెకీలకు ఇక చేదు అనుభవం ఎదురవుతోంది. అమెరికాలో తీసుకుంటున్న జీతాలు ఇక్కడ ఏ కంపెనీలు ఆఫర్ చేయడం లేదు. దీంతో అత్యంత తక్కువ జీతాలకు జాయిన్ అవుతున్నారు. అమెరికాలో లక్షల డాలర్లు జీతాలుగా తీసుకుంటే ఇండియాలో మాత్రం వారు లక్షలకే పరిమితమవుతున్నారు. అమెరికా కలల తర్వాత భారత్ లో అడుగుపెట్టిన ఉద్యోగికి జీతాల్లో దాదాపు 80 శాతం కోత విధింపు జరుగుతోంది. అమెరికా నుంచి వచ్చిన ఐటీ ఉద్యోగులకు రిక్రూట్ చేసుకునే కంపెనీల వేతనాల్లో కుదింపు విధిస్తున్నాయి.

అమెరికాలో పనిచేశామని చెప్పుకున్నప్పటికీ ఇక్కడ ఆ ఆస్థాయిలో ఉండదు.. మా కంపెనీ బడ్జెట్ ఇదేనని తెగేసి చెబుతున్నాయి. దీంతో అమెరికా నుంచి తిరిగి వచ్చిన టెకీలు లబోదిబోమనే పరిస్థితి నెలకొంది. USలో ఎంట్రీ-మిడ్ లెవల్ టెకీల జీతాలు ఇండియాలో CEO లేదా డైరెక్టర్ స్థాయి జీతాలకు సమానం.అయితే ఈ స్థాయిలో తిరిగి వచ్చిన వారిని తీసుకునేకుందుకు కంపెనీలు కూడా సిధ్దంగా లేవు.

వ్యక్తిగత కారణాల వల్ల లేదా H-1B వీసా గడువు ముగియడం వల్ల అమెరికా నుండి ఇండియాకు తిరిగి వచ్చే సమయంలో జీతాల తగ్గింపుకు మానసికంగా ఎలా సిధ్దం కావాలని Reddit లో ఓ యూజర్ అడిగారు. మీరు ఇండియాకు తిరిగి వస్తే ఇక్కడ అక్కడి జీతాలు వస్తాయనే ఊహను బంద్ చేయాలని చాలామంది పిలుపునిచ్చారు.అమెరికాలో మీరు $100K తీసుకుంటే ఇండియాలో సంవత్సరానికి రూ.10 లక్షలు తీసుకోవడంతో సమానమని.. అయినా అవి రెండూ అంతగా సంతృప్తి పరచవని రెడ్డిట్ యూజర్ తెలిపారు.

మరో యూజర్.. నేను 10 సంవత్సరాల క్రితం దాని కంటే ఎక్కువ సంపాదించేవాడిని. అయితే పరుగులు పెడుతున్న నేటి ఆధునిక ప్రపంచంలో మంచి జీవితం గడపాలంటే 40 నుంచి 50 లక్షలు జీతం అవసరమని తెలిపారు. రూ. 8 లక్షలు తక్కువ ధర ఆఫర్ వచ్చిన వెంటనే ఉద్యోగాన్ని వదిలివేసి, వేరే ఉద్యోగంలో రూ. 17 లక్షలు సంపాదించే టెక్నీలు ఇప్పటికీ ఉన్నారు. అయితే అత్యంత నైపుణ్యం ఉన్నప్పటికీ పోటీతత్వ ఉద్యోగ మార్కెట్లో ఇది అందరికీ సాధ్యం కాదని కొందరు అంటున్నారు. సంవత్సరాల అనుభవం ఉన్న సీనియర్ టెకీలు ఎల్లప్పుడూ అర్హత కలిగిన జీతం కోసం పోరాడాలని పిలుపునిస్తున్నారు. భారత టెక్ మార్కెట్ క్రూరంగా ఉండవచ్చు కానీ అది అసాధ్యం కాదని చెబుతున్నారు.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+