For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి సెకనూ పైసలే.. కోట్లు సంపాదిస్తున్న కంపెనీలు.. కళ్లు చెదిరే ఆదాయం..

|

Revenue: ప్రపంచ పెద్దన్నగా కొనసాగుతున్న అమెరికాలో కంపెనీల ఆదాయం సైతం అదే స్థాయిలో ఉంది. ధనికుల సంపాదన, సామాన్యుల ఆదాయాల మధ్య వ్యత్యాసం చూస్తే ఔరా అని నోరెళ్లబెట్టాల్సిందే. పెద్ద కంపెనీలు సెకనుకు ఎంత సంపాదిస్తాయో తెలిస్తే గుండె ఝల్లుమనక మానదు.

టిపాల్టీ అధ్యయనం..

టిపాల్టీ అధ్యయనం..

అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ ఆర్థిక సాంకేతిక సంస్థ టిపాల్టీ అమెరికా కంపెనీలైన మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్ ప్రతి సెకనుకు దాదాపు వెయ్యి డాలర్లు సంపాదిస్తున్నాయి. అంటే రోజుకు కంపెనీలు సుమారుగా 100 మిలియన్ డాలర్లకు పైగా ఆర్జిస్తున్నాయి. ఇదే సమయంలో సగటు అమెరికన్ కార్మికుడు తన జీవితకాలంలో 1.7 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నట్లు అధ్యయనం వెల్లడించింది.

ఆపిల్ కంపెనీ..

ఆపిల్ కంపెనీ..

ఐఫోన్ మేకర్ ఆపిల్ ప్రతి సెకనుకు సుమారు 1,820 డాలర్లను ఆర్జిస్తోంది. భారత కరెన్సీ లెక్కల ప్రకారం ఈ మెుత్తం విలువ దాదాపు రూ.1.58 లక్షలు. ఈ లెక్కన కంపెనీ రోజుకు 15.7 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.1,282 కోట్ల లాభాన్ని ఆర్జిస్తోంది.

మైక్రోసాఫ్ట్..

మైక్రోసాఫ్ట్..

ఆదాయం పరంగా ఆపిల్ తర్వాత మైక్రోసాఫ్ట్ రెండో స్థానంలో ఉంది. ఈ కంపెనీ సెకనుకు 1404 డాలర్లు అంటే రూ.1.14 లక్షల రూపాయలు సంపాదిస్తుంది. ఇక మూడవ స్థానంలో భారతీయుడు సుందర్ పిచాయ్ నేతృత్వంలో నడుస్తున్న గూగుల్ 1277 డాలర్లను ప్రతి సెకనుకు సంపాదిస్తోంది. దీని తర్వాత నాలుగో స్థానంలో ఉన్న ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా సెకనుకు 924 డాలర్లను ఆర్జిస్తోంది.

భారత కంపెనీలు..

భారత కంపెనీలు..

ఈ జాబితాలోని టాప్-10 స్థానాల్లో ఒక్క భారతీయ కంపెనీ కూడా లేదు. అయితే ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సెకనుకు 213.60 డాలర్లను ఆర్జిస్తూ 40వ స్థానంలో నిలిచింది. 72వ స్థానంలో టాటాలకు చెందిన TCS, 93వ స్థానంలో దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నిలవటం గమనార్హం.

English summary

ప్రతి సెకనూ పైసలే.. కోట్లు సంపాదిస్తున్న కంపెనీలు.. కళ్లు చెదిరే ఆదాయం.. | from apple to meta companies earning lakhs every second reliance, tcs

from apple to meta companies earning lakhs every second reliance, tcs
Story first published: Friday, November 25, 2022, 17:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X