Franklin Templeton: వారికి రూ.3,303 కోట్ల చెల్లింపులు
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ ఆపివేసిన 6 డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లకు సోమవారం నుండి అయిదో విడత చెల్లింపులు ప్రారంభమయ్యాయి. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్(SBI-MF) ఈ మేరకు సదరు యూనిట్ హోల్డర్లకు రూ.3,302.75 కోట్ల మేర చెల్లింపులు చేస్తుంది.
దీంతో మొత్తం చెల్లింపులు రూ.21,080 కోట్లకు చేరుతాయని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రతినిధి తెలిపారు. అంటే ఈ స్కీంలలోని నిర్వహణ ఆస్తుల్లో 84 శాతానికి చేరుకుంటాయి.
గత ఏడాది ఏప్రిల్ 23వ తేదీ నాటికి ఈ స్కీంల నిర్వహణలోని నిధుల్లో 84 శాతం. జూన్ 9వ తేదీ నాటికి ఆ యూనిట్ల నికర వ్యాల్యూ ఆధారంగా సొమ్ము జమ చేయనుంది. మొదటి విడతలో భాగంగా ఫిబ్రవరి నెలలో ఇన్వెస్టర్లు రూ.9,122 కోట్లు అందుకున్నారు. ఏప్రిల్ నెలలో రూ.2,962 కోట్లు వచ్చాయి. మే 3వ తేదీ వారంలో రూ.2,489 కోట్లు, ఇప్పుడు రూ.3,205 కోట్లు ఇన్వెస్టర్లకు అందాయి.

ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ప్రయివేట్ లిమిటెడ్ వచ్చే విడతలో భాగంగా రూ.3,302.75 కోట్లను ఆరు డెట్ పథకాలకు సంబంధించి యూనిట్ హోల్డర్లకు అందిస్తామని అధికార ప్రతినిధి తెలిపారు. అందుబాటులోని వివరాలతో పాటు కేవైసీ కంప్లైంట్ ఉన్న అందరు పెట్టుబడిదారులకు జూలై 12, 2021 వారంలో చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు.