For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Forex: భారత్ వద్ద పెరిగిన ఫారెక్స్ నిల్వలు.. కానీ ఆ ప్రమాదం ఇంకా ఉంది.. సామాన్యులకు..

|

Forex Reserves Rise: భారత్ వద్ద విదేశీ మారకద్రవ్య నిల్వలు జూన్ 24తో ముగిసిన వారంలో వరుసగా మూడు వారాల పాటు పడిపోయిన తర్వాత 2 బిలియన్ డాలర్లకు పైగా పెరిగాయి. ఒకపక్క రూపాయి కొత్త రికార్డు కనిష్టాలను తాకుతున్న వేళ డాలర్ మాత్రం బలంగా కొనసాగుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా వీక్లీ సప్లిమెంట్ డేటా ప్రకారం.. జూన్ 24తో ముగిసిన వారంలో దేశ ఫారెక్స్ నిల్వలు 2.735 బిలియన్ డాలర్లు పెరిగి 593.323 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది దేశ దిగుమతి కవర్ ను పెంచింది.

బంగారం నిల్వలు ఎంత పెరిగాయి:
జూన్ 24తో ముగిసిన వారంలో మొత్తం నిల్వల్లో గణనీయమైన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సిఎ) 2.334 బిలియన్ డాలర్లు పెరిగి 529.216 బిలియన్ డాలర్లకు చేరుకోగా, బంగారం నిల్వలు 342 మిలియన్ డాలర్లు పెరిగి 40.926 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బిఐ తెలిపింది.

Forex Reserves Rise morethan 2 Billion Dollars with indian reserve bank after 3 weeks continuous fall

ప్రమాదం పొంచి ఉంది:
డాలర్ పరంగా వ్యక్తీకరించబడిన FCAలు.. యూరో, స్టెర్లింగ్, యెన్ వంటి విదేశీ మారక నిల్వల్లో ఉన్న ఇతర దేశాల కరెన్సీల విలువ లేదా తరుగుదలను ఇందులో లెక్కలోకి తీసుకుంటారు. అయితే డాలర్ తన ఆధిపత్యాన్ని తిరిగి పొందింది. రూపాయి జీవితకాల కనిష్ట స్థాయికి పతనం నిరంతరాయంగా కొనసాగుతోంది. కాబట్టి.. దేశం దిగుమతులకు ఇంకా ప్రమాదం అలాగే పొంచి ఉంది. అయితే దిగుమతులు చేసుకుంటున్న వస్తువులకు భారత్ డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి.. భారత కరెన్సీ ప్రకారం అవి మరింత ప్రియంగా మారతాయి. ఈ ప్రభావం సామాన్యులపైనా పడుతుంది. అయితే పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు రిజర్వు బ్యాంక్ ఇప్పటికే అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

English summary

Forex: భారత్ వద్ద పెరిగిన ఫారెక్స్ నిల్వలు.. కానీ ఆ ప్రమాదం ఇంకా ఉంది.. సామాన్యులకు.. | Forex Reserves Rise morethan 2 Billion Dollars with indian reserve bank after 3 weeks continuous fall

India's foreign exchange reserves rose over $2 billion in the week ending June 24 after falling for three weeks in a row
Story first published: Saturday, July 2, 2022, 17:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X