For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రికార్డ్ గరిష్టానికి చేరుకున్న ఫారెక్స్ నిల్వలు: 589 బిలియన్ డాలర్లకు జంప్

|

భారత ఫారెక్స్ నిల్వలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మే 7 తేదీ నాటికి ఈ నిల్వలు 58,946 కోట్ల (589.4 బిలియన్ డాలర్లు) అమెరికా డాలర్లకు చేరుకున్నాయి. మన కరెన్సీలో దాదాపు రూ.43.21 లక్షల కోట్లు అన్నమాట. అంతకు ముందు వారంతో పోలిస్తే ఇది 144.4 కోట్ల డాలర్లు ఎక్కువ అని ఆర్బీఐ తెలిపింది. ఏప్రిల్ 30వ తేదీతో ముగిసిన వారాంతంలోను ఫారెక్స్ నిల్వలు 391.3 కోట్ల డాలర్లు పెరిగి 58,802 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.

విదేశీ మారక నిల్వలు నగదు మరియు ఇతర రిజర్వ్ ఆస్తులు. ఇవి సెంట్రల్ బ్యాంక్ లేదా ఇతర ద్రవ్య అధికారం కలిగి ఉంటాయి. ఇవి ప్రధానంగా దేశం యొక్క చెల్లింపులను సమతుల్యం చేయడానికి, దాని కరెన్సీ యొక్క విదేశీ మారకపు రేటును ప్రభావితం చేయడానికి ఉపయోగపడుతుంది. వీటిని ఫారెక్స్ నిల్వలు లేదా ఎఫ్ఎక్స్ నిల్వలు అని కూడా పిలుస్తారు.

Forex reserves near record high at $589 billion

ఎక్కువగా అమెరికా డాలర్, కొంతవరకు యూరో విదేశీ మారక నిల్వలు, డిపాజిట్స్, బాండ్స్, ట్రెజరీ బిల్లులు, రిజర్వ్ కరెన్సీ ఇతర ప్రభుత్వ సెక్యూరిటీలను కలిగి ఉంటాయి. కొన్ని దేశాలు తమ నిల్వల్లో కొంత భాగాన్ని బంగారం రూపంలో కలిగి ఉంటాయి. ప్రత్యేక డ్రాయింగ్ హక్కులను రిజర్వ్ ఆస్తులుగా పరిగణిస్తారు.

Read more about: forex reserves
English summary

రికార్డ్ గరిష్టానికి చేరుకున్న ఫారెక్స్ నిల్వలు: 589 బిలియన్ డాలర్లకు జంప్ | Forex reserves near record high at $589 billion

India’s foreign exchange reserves rose by $1.444 billion to $589.465 billion in the week of May 7, the Reserve Bank of India’s weekly statical data showed on Friday.
Story first published: Sunday, May 16, 2021, 13:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X