కరోనా మహమ్మారి - షట్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. భారత్ రెండు నెలలుగా లాక్ డౌన్‌లో ఉంది. దీంతో మన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. కరోనా వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థ కారణంగా ఆసియా దేశాల నుండి పెద్ద ఎత్తున విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.

ఆసియా దేశాల నుండి 26 బిలియన్ డాలర్లు
ఈ మేరకు 'ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ 19 ప్రభావం' పేరుతో కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (CRS) ఓ అధ్యయనం చేసింది. ఇందులో భారత్ సహా ఆసియా దేశాల నుండి పెద్ద ఎత్తున పెట్టుబడులు వెనక్కి పోయాయి. కరోనా తర్వాత గత కొద్ది నెలల్లోనే 26 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు ఆసియాలో పలు అభివృద్ధి చెందిన దేశాల నుండి వెనక్కి వెళ్లినట్లు ఈ అధ్యయనం తెలిపింది.

ఇండియా నుండి 16 బిలియన్ డాలర్లు
ఇందులో కేవలం భారత్ నుండే 16 బిలియన్ డాలర్ల మేర ఉండటం గమనార్హం. ఆసియాలో రానున్న రోజుల్లో భారీ ఆర్థికమాంద్యం తప్పదేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురై పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. ఇతర సంస్థలు కూడా ఇండియా, ఆసియా దేశాల నుండి పెట్టుబడులు పెద్ద మొత్తంలో వెనక్కి వెళ్లినట్లు వెల్లడించాయి.

ప్రభుత్వ సాయం కోసం 3 కోట్ల మంది..
CRS నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. జర్మనీ,ఫ్రాన్స్, యూకే, స్పెయిన్, ఇటలీ వంటి ఐరోపా దేశాల్లో 30 మిలియన్లకు (3 కోట్లు) పైగా ప్రజలు ప్రభుత్వ సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. యూరోజోన్ ప్రాంతంలో 2020 క్యాలెండర్ ఇయర్‌లో మొదటి క్వార్టర్‌లో వృద్ధి రేటు 3.8 శాతం కుంగిపోయింది. 1995 తర్వాత ఈ స్థాయిలో కుంగిపోవడం ఇదే మొదటిసారి.

అమెరికా దారుణం.. భారత్ కాస్త బెట్టర్
అమెరికాలో 2020 క్యాలెండర్ ఇయర్ తొలి క్వార్టర్‌లో వృద్ధి రేటు 4.8 శాతం కుదించుకుపోతుందని తెలిపింది. 2008 సంక్షోభం తర్వాత ఈ స్థాయిలో వృద్ధి రేటు క్షీణించడం ఇదే మొదటిసారి అని తెలిపింది. ప్రపంచ దేశాలకు కరోనా ఆర్థిక సవాళ్లను విసురుతోందని తెలిపింది. ఇక, భారత్‌కు కొంతలో కొంత ఊరట కలిగించే విషయం ఏమంటే భారత్ సహా మరో రెండు దేశాల వృద్ధి రేటు మాత్రం పాజిటివ్‌గా ఉండవచ్చునని CRS నివేదిక తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications