For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికా లేదా సింగపూర్‌లో వచ్చే ఏడాది ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్

|

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 2021లో లిస్టింగ్ కానుంది. విదేశాల్లో నమోదు కానున్నట్లు అంతర్జాతీయ మార్కెట్లో వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్ 45 బిలియన్ డాలర్ల నుండి 50 బిలియన్ డాలర్ల మేర వ్యాల్యూకు చేరాలని లక్ష్యం పెట్టుకోవచ్చునని చెబుతున్నారు. ఈ స్థాయికి చేరాలంటే ఫ్లిప్‌కార్ట్ మాతృసంస్థ వాల్‌మార్ట్ తన పెట్టుబడులను రెట్టింపు కంటే ఎక్కువగా చేయవలసి రావొచ్చునని చెబుతున్నారు.

ఐపీవో కోసం సింగపూర్ లేదా అమెరికాను ఎంచుకోవచ్చునని చెబుతున్నారు. అయితే దీనిపై ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ స్పందించాల్సి ఉంది. దేశీయ కంపెనీలు విదేశాల్లో నేరుగా లిస్టింగ్ అయ్యేలా భారత్ కొత్త నిబంధనల డ్రాఫ్ట్ పైన చర్చిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. 2018లో ఫ్లిప్‌కార్ట్‌లో 21 బిలియన్ డాలర్ల వద్ద వాల్‌మార్ట్ 16 బిలియన్ డాలర్లతో 77 శాతం వాటాను కొనుగోలు చేసింది.

2019 బెస్ట్, 2020 వరస్ట్: ఒక్కో గదిపై దారుణంగా పడిపోయిన ఆదాయం, హోటల్స్‌కు వేలకోట్ల నష్టం2019 బెస్ట్, 2020 వరస్ట్: ఒక్కో గదిపై దారుణంగా పడిపోయిన ఆదాయం, హోటల్స్‌కు వేలకోట్ల నష్టం

Flipkart eyes overseas listing as early as 2021

వాల్‌మార్ట్ టైమ్‌లైన్ ప్రకారం 2022 నాటికి ఐపీవో చేయవచ్చు. కానీ కస్టమర్లు ఆన్ లైన్ షాపింగ్ కోసం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. డిజిటల్ పరివర్తన వేగంగా మారింది. దీంతో ఫ్లిప్‌కార్ట్ ఐపీవోను వేగవంతం చేసిందని చెబుతున్నారు. అమెరికాలో ఐపీవో ఉంటే మంచి వ్యాల్యూను పొందవచ్చునని అంటున్నారు. ఫ్లిప్‌కార్ట్ అనుబంధ సంస్థ ఫోన్ పే కూడా 2022 నాటికి లాభాల్లోకి వస్తుందని, 2023లో పబ్లిక్ ఆఫర్‌కు వస్తుందని భావిస్తున్నారు.

English summary

అమెరికా లేదా సింగపూర్‌లో వచ్చే ఏడాది ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ | Flipkart eyes overseas listing as early as 2021

Flipkart may go public as early as next year at a valuation of $40-45 billion, a person familiar with the development said, as India’s largest online retailer benefits from accelerated adoption of digital platforms for shopping and payments by customers because of the coronavirus pandemic.
Story first published: Thursday, September 17, 2020, 15:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X