For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మందుబాబులకు గుడ్‌న్యూస్: ఫ్లిప్‌కార్ట్‌లో ఆల్కహాల్ ఆర్డర్ చేయొచ్చు, హోండెలివరీ తీసుకోవచ్చు!

|

ఇప్పుడు ప్రపంచంలో దేనినైనా ఆన్లైన్ లో ఆర్డర్ చేసి, ఇంటికే డెలివరీ తీసుకునే వెసులుబాటు ఉంది. కానీ, ఇండియా లో మాత్రం లిక్కర్ ను ఆన్లైన్ లో విక్రయించటం, దానిని డెలివరీ చేయటం చట్ట విరుద్ధం. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ అంశంలో ప్రభుత్వం కాస్త మెత్తబడింది. ప్రస్తుతం సామాజిక దూరం పాటించాల్సిన సమయం. మానవ ప్రమేయాన్ని తగ్గించాల్సిన కాలం. కాబట్టి, మిగితా సరుకుల డెలివరీ ని అనుమతిస్తున్నట్లే... లిక్కర్ ను కూడా ఆన్లైన్ లో ఆర్డర్ చేసి డెలివరీ తీసుకునేలా అనుమతులు లభిస్తున్నాయి.

ఇప్పటికే ఇండియా లో ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలు స్థానికంగా కొన్ని సంస్థలకు ఈ మేరకు అనుమతులు మంజూరు చేశాయి. కర్ణాటక కూడా దీనికి ఓకే చెప్పింది. అయితే అమల్లో మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో అమలు జరగటం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలు అందించే స్విగ్గి, జొమాటో లు లిక్కర్ డెలివరీ సేవలు అందించేందుకు ముందుకు రాగా... ప్రస్తుతం దేశంలోనే అతి పెద్ద ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ కూడా ఇందుకు సై అంటోంది.

ట్యాక్స్‌పేయర్ చార్టర్.. పన్ను చెల్లింపుదారుకు ప్రయోజనం: ఏమిటీ ఫేస్‌లెస్ అసెస్‌మెంట్?

డైజియో తో జట్టు...

డైజియో తో జట్టు...

దేశంలో లిక్కర్ కంపెనీల్లోకి ప్రముఖ మైన డైజియో కంపెనీ తో ఫ్లిప్ కార్ట్ జట్టు కట్టింది. డైజియో కు చెందిన హిప్ బార్ అనే మొబైల్ ఆప్ తో కలిసి లిక్కర్ డెలివరీ సేవలు అందించేలా ఏర్పాట్లు చేసుకుంది ఫ్లిప్ కార్ట్. హిప్ బార్ అనేది ఆన్లైన్ లో ఆర్డర్లను తీసుకునే మొబైల్ ఆప్. దీనిని డైజియో తన సొంత అవసరాల కోసం రూపొందించుకుంది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ తో జట్టు కట్డటంతో ఇకపై ఫ్లిప్ కార్ట్ లోనే నేరుగా లిక్కర్ కొనుగోలు చేసేందుకు అవకాశం లభిస్తుంది. అయితే ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ కు పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయని సమాచారం. ఈ మేరకు ప్రముఖ వార్తా ఏజెన్సీ రాయిటర్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ భాగస్వామ్యం ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు లభించనున్నాయి. ఇక వైన్ షాపుల వద్ద పెద్ద పెద్ద క్యూలో నిలుచోనక్కరలేదు. అలాగే బార్ కు వెళ్లి మందు తాగాల్సిన అవసరం కూడా తప్పుతుంది. దీంతో అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. డ్రంకెన్ డ్రైవ్ కేసులు గణనీయంగా తగ్గేందుకు కూడా దోహదపడుతుంది.

అమెజాన్ తో పోటీ లో...

అమెజాన్ తో పోటీ లో...

కొన్ని నెలల క్రితమే అమెజాన్ కూడా ఆల్కహాల్ డెలివరీ సేవల్లోకి ప్రవేశిస్తున్నట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. ఇండియా లో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ల మధ్య పోటీ అసాధారణ రీతిలో ఉంటుంది. అగ్రస్థానం కోసం రెండు కంపెనీలు విపరీతంగా పోటీ పడుతున్నాయి. దాదాపు ఒకే స్థాయి ఆర్డర్లు, బిజినెస్ చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో పోటీ కంపెనీ ఏదైనా కొత్త విభాగంలోకి ప్రవేశిస్తే... వెంటనే అదే రంగంలోకి మరో సంస్థ కూడా ప్రవేశించటం ఆనవాయితీ గా ఉంటుంది. ప్రస్తుతం లిక్కర్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఇప్పటికే ఈ రంగంలో ఫుడ్ డెలివరీ సంస్థలలో జొమాటో, స్విగ్గి ఉండనే ఉన్నాయి. త్వరలోనే మరిన్ని సంస్థలు కూడా రంగ ప్రవేశం చేసే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఈ సెక్టార్ కూడా అధిక పోటీని ఎదుర్కొంటుందని వేరే చెప్పనక్కరలేదు.

చాలా పెద్ద మార్కెట్...

చాలా పెద్ద మార్కెట్...

ఇండియా లో మంచి నీళ్లు దొరకని ప్రాంతం ఉంటుందేమో కానీ... మందు దొరకని ప్లేస్ లేదంటే అతిశయోక్తి లేదు. అంతలా విస్తరించిన లిక్కర్ మార్కెట్ మన దేశంలో సుమారు 27 బిలియన్ డాలర్లు (సుమారు రూ 2,02,500 కోట్లు) ఉంటుందని అంచనా. మరీ ముఖ్యంగా లిక్కర్ విషయంలో దేశంలోనే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు అధిక టర్నోవర్ చేస్తుంటాయి. ఆయా రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరు కూడా లిక్కర్ అమ్మకమే కాబట్టి, దానిని ప్రోత్సహిస్తుంటారు. ఇప్పుడు ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తూ, ఇంట్లో అంటూ సేవించే వెసులుబాటు లభించటం వల్ల మరింత మంది వినియోగదారులు ఇటు వైపు మళ్లుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంత పెద్ద మార్కెట్ కాబట్టి తప్పనిసరిగా ఎంట్రీ ఇచ్చి తమ విలువ మరింత పెంచుకోవాలని ఫ్లిప్ కార్ట్ వంటి కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.

English summary

Flipkart eyes alcohol delivery foray with Indian startup

Walmart's e-commerce platform Flipkart has partnered with a startup backed by spirits giant Diageo to deliver alcohol in two Indian cities, according to government letters seen by Reuters, months after Amazon planned a similar foray.
Story first published: Saturday, August 15, 2020, 16:27 [IST]
Company Search