For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎయిర్ టిక్కెట్ బుకింగ్స్ రీఫండ్, సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే?

|

కరోనా మహమ్మారి, లాక్ డౌన్ సమయానికి ముందు బుక్ చేసిన విమానాల టిక్కెట్ల మొత్తాన్ని తిరిగి ప్రయాణీకులకు చెల్లించాలని విమానయాన సంస్థలను సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది. మార్చి 25వ తేదీ నుండి మే 24వ తేదీ వరకు ప్రయాణించేందుకు ప్రయాణీకులు టిక్కెట్లు బుక్ చేసుకున్నప్పటికీ, విమాన సర్వీసుల రద్దయిన విషయం తెలిసిందే. ఈ సొమ్మును బుక్ చేసుకున్న వారికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ముగ్గురు జడ్జిలతో కూడిన బెంచ్ ఈ మేరకు ఆదేశించింది.

ఆ క్వార్టర్ తుడిచి పెట్టుకుపోయింది, బిజినెస్ అజెండాను అదే నిర్ణయిస్తుంది: HCL రోష్నీఆ క్వార్టర్ తుడిచి పెట్టుకుపోయింది, బిజినెస్ అజెండాను అదే నిర్ణయిస్తుంది: HCL రోష్నీ

సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే

సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే

లాక్ డౌన్ నేపథ్యంలో విధించిన ఆంక్షల కారణంగా రద్దయిన విమానాల టిక్కెట్ల ధరను తిరిగి చెల్లించడానికి సంబంధించి డీజీసీఏ రూపొందించిన ప్రణాళికను సుప్రీం కోర్టు ఆమోదించింది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం విమానయాన సంస్థలు తమ వద్ద టిక్కెట్ తీసుకున్న ప్రయాణీకుల పేరు మీద క్రెడిట్ షెల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సొమ్ముతో 2021 మార్చి 31వ తేదీలోగా ఏ మార్గంలో అయినా విమానయానం చేసే అవకాశం ప్రయాణీకులకు కల్పిస్తారు.

ఈ క్రెడిట్ షెల్‌ను ఇతరులకు కూడా బదలీ చేయవచ్చు. టిక్కెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు లేకుండా దీనిని చెల్లిస్తుంది. రద్దు చేసిన తేదీ నుండి మూడు వారాల వ్యవధిలో డబ్బు వాపస్ ఇవ్వాలి. టిక్కెట్ రద్దు చేసుకున్న తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు 0.5 శాతం వడ్డీ, జూలై 1వ తేదీ నుండి 2021 మార్చి 31వ తేదీ వరకు 0.75 శాతం వడ్డీని విమానయాన సంస్థలు చెల్లించాలి.

ఏజెంట్‌ను సంప్రదించాలి

ఏజెంట్‌ను సంప్రదించాలి

లాక్ డౌన్ పీరియడ్‌లో తమ డబ్బుకు సంబంధించి ప్రయాణీకులు ఏజెంట్‌ను సంప్రదించాలి. ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసిన రీఫండ్ మొత్తాన్ని వారి నుండి కలెక్ట్ చేసుకోవచ్చు. ఏజెంట్లవాఅకౌంట్‌లలోకి మనీ క్రెడిట్ అవుతుంది. దీనిని సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్ (CAR) నియంత్రిస్తుంది.

తక్షణమే చెల్లించాలని...

తక్షణమే చెల్లించాలని...

మార్చి 25 నుండి ఏప్రిల్ 14 మధ్యలో బుక్ చేసిన టిక్కెట్ల ధరను ప్రయాణీకులకు తక్షణమే చెల్లించాలని డీజీసీఏ ఏప్రిల్ 16వ తేదీన ఆదేశాలు ఇచ్చింది. లాక్ డౌన్ సమయంలో బుక్ చేసుకున్న విమాన టిక్కెట్ల సొమ్మును తిరిగి చెల్లించాలని కోరుతూ ప్రవాసీ లీగల్ సెల్, ఎయిర్ పాసింజర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది.

English summary

ఎయిర్ టిక్కెట్ బుకింగ్స్ రీఫండ్, సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే? | Flight ticket cancellation amid Corona lockdown: SC orders full refund

The Supreme Court on Thursday ordered the airlines to refund the passengers who had to cancel the flight tickets booked during two month long nationwide lockdown.
Story first published: Thursday, October 1, 2020, 17:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X