For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికా క్యాపిటల్ హింసకు ముందు వారికి భారీగా బిట్‌కాయిన్ పేమెంట్స్

|

అమెరికా కాపిటోల్ రచ్చ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది ట్రంప్‌కు మచ్చ తీసుకు రావడంతో పాటు అభిశంసన ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా దిగ్గజంలు కూడా షాకిచ్చాయి. యూఎస్ కాపిటోల్ ఘటనకు ముందు 22 వివిధ వర్చువల్ వ్యాలెట్స్‌లోకి 500,000 డాలర్ల విలువైన బిట్ కాయిన్ పేమెంట్స్ జరిగినట్లుగా క్రిప్టోకరెన్సీ కాంప్లియెన్స్ స్టార్టప్ చైనాలసిస్ శుక్రవారం తెలిపింది. ఓ ఫ్రెంచ్ డోనర్ ద్వారా గత ఏడాది డిసెంబర్ 8న 28.15 బిట్‌కాయిన్స్ పడినట్లు చెబుతున్నారు. ఇది న్యూయార్క్‌కు చెందిన స్టార్టప్.

మొదట యాహూన్యూస్

మొదట యాహూన్యూస్

ఈ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన వివరాలను తొలుత యాహూన్యూస్ వెలువరించింది. తదుపరి వివరాలు, విచారణ కోసం తన డేటాను చైనాలసిస్‌తో పంచుకుంది. ఆల్ట్-రైట్ గ్రూప్స్, వ్యక్తులు పెద్ద మొత్తంలో బిట్ కాయిన్ డొనేషన్స్ అందుకున్నట్లు తెలిందని, ఇదంతా కేవలం సింగిల్ ట్రాన్సాక్షన్‌లో అందుకున్నారని వెల్లడైందని చైనాలసిస్ తెలిపింది.

అక్కడి నుండి

అక్కడి నుండి

ఈ బిట్ కాయిన్ డోనర్ కూడా ఫ్రాన్స్‌లో ప్రస్తుతం మరణించిన కంప్యూటర్ ప్రోగ్రామర్ అని సూచించే ఆధారాలను తాము సేకరించినట్లు చైనాలసిస్ తెలిపింది. కాగా, హేట్ స్పీచ్ నేపథ్యంలో నిక్ ఫ్యూంట్స్ గత ఏడాది యూట్యూబ్ నుండి శాశ్వతంగా సస్పెండ్ అయ్యాడు. అతను 250,000 డాలర్ల విలువైన 13.5 బిట్‌కాయిన్స్ అందుకున్నాడు. ఇందులో అతిపెద్ద లబ్ధిదారు ఇతను. ఫ్యూంట్స్ దీనిపై స్పందించాల్సి ఉంది.

ఇటీవలే ఆ యాప్‌కు టెక్ దిగ్గజాల షాక్

ఇటీవలే ఆ యాప్‌కు టెక్ దిగ్గజాల షాక్

కాగా, పార్లెర్ యాప్‌కు ఇటీవల టెక్ దిగ్గజాలు అమెజాన్, గూగుల్, ఆపిల్ షాకిచ్చాయి. దీనిని యాప్ స్టోర్ నుండి తొలగించాయి. పార్లెర్ ఆల్టర్నేటివ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం. ఈ మూడు సంస్థలు కూడా కేవలం 24 గంటల వ్యవధిలోనే పార్లెర్‌ను తొలగించాయి. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లకు ప్రత్యామ్నాయంగా స్వేచ్ఛా ప్రసంగం (ఫ్రీ-స్పీచ్) కలిగిన పార్లెర్ ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంది.

English summary

అమెరికా క్యాపిటల్ హింసకు ముందు వారికి భారీగా బిట్‌కాయిన్ పేమెంట్స్ | Far right groups received large Bitcoin payment ahead of US Capitol riot

Payments in bitcoin worth more than $500,000 were made to 22 different virtual wallets, most of them belonging to far-right activists and internet personalities, before the storming of the U.S. Capitol, cryptocurrency compliance startup Chainalysis said on Friday.
Story first published: Friday, January 15, 2021, 14:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X