For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పన్ను చెల్లింపుదారులు లేకుండా... ఫేస్‌లెస్ అసెస్‌మెంట్‌తో చెల్లింపులు చాలా ఈజీ

|

ఆదాయపు పన్ను రిటర్న్స్ మదింపు అవసరమైన సమయంలో పన్ను చెల్లింపుదారులకు వ్యక్తిగత హాజరు మినహాయింపును ఇచ్చి దాని స్థానంలో ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ విధానాన్ని తీసుకు వచ్చామని, దీంతో పన్ను చెల్లింపులు ఎంతో సులభం అయ్యాయని సీబీడీటీ చైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ అన్నారు. అంటే ట్యాక్స్ పేయర్ ఏ ఆఫీస్‌కు వెళ్లవలసిన అవసరం లేదు. ఏ అధికారిని కలవాల్సిన అవసరం లేదు.

ఐటీ రిటర్న్స్ కొత్త రూల్, భారీ ట్రాన్సాక్షన్స్ లెక్కలు చెప్పాల్సిందేఐటీ రిటర్న్స్ కొత్త రూల్, భారీ ట్రాన్సాక్షన్స్ లెక్కలు చెప్పాల్సిందే

ఆన్‌లైన్‌లోనే సమాధానం ఇవ్వాలి

ఆన్‌లైన్‌లోనే సమాధానం ఇవ్వాలి

నష్టభయం ఆధారంగా పన్ను రిటర్న్స్‌ను సెంట్రల్ కంప్యూటర్ ఎంపిక చేసుకొని తనిఖీ చేస్తుందని తెలిపారు. ఆ తర్వాత దానిని అధికారుల బృందానికి పంపిస్తుందని, వేరే ప్రదేశంలో వీటిని సమీక్షించిన అనంతరం ఏకాభిప్రాయం వస్తేనే సెంట్రల్ కంప్యూటర్ వ్యవస్థకు నోటీసు పంపిస్తారు. ఇలాంటి నోటీసులకు పన్ను కార్యాలయం లేదా అధికారితో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌లోనే సమాధానం ఇవ్వాలని తెలిపారు.

ఎలక్ట్రానిక్ విధానంలోనే..

ఎలక్ట్రానిక్ విధానంలోనే..

2017లో ప్రధాని నరేంద్ర మోడీ సులభతరం చేసేందుకు ఫేస్‌లెస్ ట్యాక్సేషన్ సిస్టంను రూపొందించారు. ఈ విధానాన్ని సీబీడీటీ ప్రారంభించిన తర్వాత 58,319 కేసులను కంప్యూటర్ అల్గారిథం ఆధారంగా సమీక్షించారు. ఇందులో 8000 కేసుల్లో మదింపు ఆదేశాలను జారీ చేశారు. 291 కేసుల్లో అదనపు వివరాలు కోరినట్లుగా తెలుస్తోంది. కొత్త వ్యవస్థతో ఆదాయపు పన్ను మదింపు ఎలక్ట్రానిక్ విధానంలోనే పూర్తయ్యే సౌలభ్యం వచ్చిందని తెలిపారు ప్రమోద్ చంద్ర మోదీ. మొత్తం కేసుల్ని అక్టోబర్‌కు మదింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

పారదర్శకత

పారదర్శకత

ఫేస్‌లెస్ విధానం ద్వారా పారదర్శకత కనిపిస్తుందని, ట్యాక్స్ పేయర్స్ నమ్మకాన్ని పెంచుతుందన్నారు. ఫేస్‌లెస్ అసెస్‌మెంట్‌కు రెండు దశలు ఉన్నాయని, టెక్నికల్ అసెస్‌మెంట్, వెరిఫికేషన్ అని చెప్పారు. ఇక్కడ అధికారులతో సంబంధం లేదని, కాబట్టి పన్ను చెల్లింపుదారులకు ట్యాక్స్ అధికారుల వేధింపులు కూడా ఉండవని చెప్పారు.

English summary

పన్ను చెల్లింపుదారులు లేకుండా... ఫేస్‌లెస్ అసెస్‌మెంట్‌తో చెల్లింపులు చాలా ఈజీ | Faceless assessment brings in greater transparency: CBDT Chairman

Faceless assessment brings in greater transparency with randomised and automated system, dynamic jurisdiction, and team-based approach, eliminating individual discretion in assessment process and thus enhances trust between income tax department and taxpayers.
Story first published: Tuesday, July 21, 2020, 11:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X