For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖేష్ అంబానీ మార్చి టార్గెట్, జియోలో ఫేస్‌బుక్ 10% వాటా

|

రిలయన్స్ జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ 10 శాతం వాటాలు కొనుగోలు చేయాలని భావిస్తోంది. నాలుగేళ్లలోనే టెలికం రంగంలో దిగ్గజ సంస్థగా ఎదిగింది జియో. ఈ నెల చివరి నాటికి జియోను రుణరహిత సంస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుంది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ టార్గెట్‌కు ఈ ఒప్పందం దోహదం చేస్తుంది.

60 బిలియన్ డాలర్ల (రూ.4,20,000 కోట్లు) విలువైన జియోలో పది శాతానికి సమానమైన వాటా కొనుగోలు చేయడానికి ఫేస్‌బుక్ 6 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టే అవకాశముంది. ఈ ఒప్పందంపై రిలయన్స్ జియో, అటు ఫేస్‌బుక్ వర్గాలు స్పందించాల్సి ఉంది. మార్చి 31, 20120 కల్లా జియోను రుణరహిత సంస్థగా చేస్తామని రిలయన్స్ గతంలోనే చెప్పింది.

Facebook looking to buy 10% stake in Reliance Jio

ఈ ఒప్పందంపై ప్రస్తుత లాక్ డౌన్ ప్రభావం ఉండవచ్చునని అంటున్నారు. తన అన్ని డిజిటల్ కార్యక్రమాలు, యాప్స్ ఒక కొత్త అనుబంధ సంస్థగా ఏర్పాటు చేయబోతున్నట్లు అక్టోబర్‌లో రిలయన్స్ తెలిపింది. అదే సమయంలో కొత్త కంపెనీలో రూ.1.08 లక్షల కోట్లను చొప్పించనున్నట్లు తెలిపింది. జీయో టీవీ, జియో సినిమా, జియో న్యూస్ వంటి జియో యాప్స్‌ను ఈ కొత్త సంస్థలకోి తీసుకు రావాలని భావించారు.

ముఖేష్ అంబానీ ఎంత నష్టపోయారంటే? ప్రపంచ కుబేరులకు చుక్కలుముఖేష్ అంబానీ ఎంత నష్టపోయారంటే? ప్రపంచ కుబేరులకు చుక్కలు

సరళమైన నిర్మాణం ద్వారా జియోలోకి వ్యూహాత్మక పెట్టుబడిదారులను ఆకర్షించవచ్చునని భావించింది. మార్చి 18న జియోకు చెందిన కొన్ని రుణాలను రిలయన్స్ తీసుకుంది. జియోలో ఫేస్‌బుక్ వాటాను కొనుగోలు చేస్తుందనే వార్తలన ేపథ్యంలో రిలయన్స్ షేర్లు బుధవారం 15 శాతం ఎగిశాయి.

English summary

ముఖేష్ అంబానీ మార్చి టార్గెట్, జియోలో ఫేస్‌బుక్ 10% వాటా | Facebook looking to buy 10% stake in Reliance Jio

Shares of Reliance Industries soared on Wednesday, driven by news reports that Facebook is eyeing a stake in Jio, the telecom business of the energy-toentertainment conglomerate.
Story first published: Thursday, March 26, 2020, 12:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X