For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Facebook: రిటైర్డ్ ఐఎఎస్ బాస్‌కు కీలక పదవి

|

న్యూఢిల్లీ: దేశంలో కొంతకాలంగా సోషల్ మీడియాకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘన వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేక సమాచారాన్ని, వీడియోలను ప్రమోట్ చేస్తున్నాయనే విమర్శలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఎదుర్కొంటోన్నాయి. నకిలీ వార్తలు, వీడియోలను ప్రమోట్ చేస్తోన్నాయని, ఫలితంగా సమాజంలో ఘర్షణ పూరక వాతావరణం ఏర్పడటానికి కారణమౌతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వాటిని దృష్టిలో ఉంచుకుని ఇదివరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను సైతం రూపొందించింది. సోషల్ మీడియా దూకుడుకు కళ్లెం వేసేలా ఏర్పాట్లు చేసింది. దీనికోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలో సవరణలను సైతం చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు, నియమ నిబంధనలను తప్పనిసరిగా అనుసరిస్తామంటూ భారత్‌లో తమ కార్యకలాపాలను సాగించే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నీ కూడా హామీ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.

ఈ విషయంలో టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను ఒక దశలో నిషేధించాలనే నిర్ణయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. పలుమార్లు నోటీసులను జారీ చేసింది. ఆ తరువాత ట్విట్టర్ మేనేజ్‌మెంట్ మెత్త బడటం, మెట్టుదిగి రావడంతో పరిస్థితులు సద్దుమణిగాయి. ఇందులో భాగంగా- ఫేస్‌బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌ పోస్టును రూపొందించింది. తొలుత అంఖీ దాస్‌ను ఈ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా నియమించుకుంది.

 Facebook: రిటైర్డ్ ఐఎఎస్ బాస్‌కు కీలక పదవి

కొన్ని సంస్థాగతరమైన కారణాలతో గత ఏడాది అక్టోబర్‌లోనే ఆమెకు ఉద్వాసన పలికింది ఫేస్‌బుక్ మేనేజ్‌మెంట్. ఆమె స్థానంలో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రాజీవ్ అగర్వాల్‌ను నియమించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటనను విడుదల చేసింది. ఫేస్‌బుక్ ఇండియా విభాగానికి పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా రాజీవ్ అగర్వాల్‌ను నియమించినట్లు తెలిపింది. సంస్థ విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడంలో రాజీవ్ అగర్వాల్ పాత్ర ఉంటుందని స్పష్టం చేసింది. భారత్ వరకు ఆయన ఈ వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షిస్తారని పేర్కొంది.

రాజీవ్ అగర్వాల్.. ఉత్తర ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఎఎస్ అధికారి. ఇదివరకు ఆయన ఉత్తర ప్రదేశ్‌లో పలు జిల్లాలకు కలెక్టర్‌గా పని చేశారు. కీలక హోదాల్లో కొనసాగారు. పదవీ విరమణ చేసిన అనంతర రాజీవ్ అగర్వాల్..ఆన్‌లైన్ కార్ల బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఉబేర్‌లో భారత్, దక్షిణాసియా పబ్లిక్ పాలసీ విభాగాధిపతిగా పని చేశారు. రెండేళ్ల పాటు ఆయన అక్కడే కొనసాగారు. ఇక తాజాగా ఆయనను అపాయింట్‌ చేసింది ఫేస్‌బుక్ యాజమాన్యం.

ఆయన నేరుగా ఫేస్‌బుక్ ఇండియా ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్‌కు రిపోర్ట్ చేస్తారని పేర్కొంది. తన విధి నిర్వహణలో భాగంగా ఆయన యూజర్ సేఫ్టీ, డేటా ప్రొటెక్షన్ అండ్ ప్రైవసీ, ఇంటర్నెట్ గవర్నెన్స్ వంటి వ్యవహారాలను పర్యవేక్షిస్తారని తెలిపింది. 26 సంవత్సరాల పాటు రాజీవ్ అగర్వాల్ ఐఎఎస్ అధికారిగా పని చేశారని, మేథోసంపత్తి హక్కుల రూపకల్పన, పరిశ్రమల, వాణిజ్య రంగాలపై ఆయనకు గట్టి పట్టు ఉందని పేర్కొంది.

రాజీవ్ అగర్వాల్ సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకోవాలనే కారణంతోనే- ఆయనను ఫేస్‌బుక్ ఇండియా పబ్లిక్ పాలసీ విభాగానికి డైరెక్టర్‌గా నియమించినట్లు పేర్కొంది. విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడంలో, కొత్త మార్గదర్శకాలు, డేటా ప్రొటెక్షన్‌, యూజర్ ప్రైవసీని పరిరక్షించడానికి తీసుకోవాల్సిన చర్యల్లో రాజీవ్ అగర్వాల్ అనుభవాన్ని తాము వినియోగించుకుంటామని ఫేస్‌బుక్ యాజమాన్యం స్పష్టం చేసింది.

English summary

Facebook India appointed former UP Cadre IAS officer Rajiv Aggarwal as the Director of Public Policy

Facebook India has appointed former IAS officer Rajiv Aggarwal as the Director of Public Policy. He succeeds Ankhi Das, who quit the company in October last year.
Story first published: Monday, September 20, 2021, 15:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X