For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంచనాలు మించిన గూగుల్, ఫేస్‌బుక్, ఆపిల్: డబుల్‌తో అమెజాన్ అదుర్స్

|

కరోనా మహమ్మారి సమయంలో టెక్ దిగ్గజాలు ఫేస్‌బుక్, ఆపిల్, గూగుల్, ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ లాభాలు ఆర్జించాయి. వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో కొన్ని రంగాలు మాత్రమే పుంజుకున్నాయి. ఇందులో మెడికల్, హెల్త్, ఈ-కామర్స్, ఇంటర్నెట్ తదితర విభాగాలు భారీగా పుంజుకున్నాయి. దీంతో టెక్ దిగ్గజాలతో పాటు ఈకామర్స్ అమెజాన్ ఏప్రిల్- జూన్ క్వార్టర్‌లో మంచి రెవెన్యూ సాధించాయి.

6 లక్షల రిలయన్స్ షేర్లు తనఖా పెట్టిన ముఖేష్ అంబానీ సన్నిహితుడు6 లక్షల రిలయన్స్ షేర్లు తనఖా పెట్టిన ముఖేష్ అంబానీ సన్నిహితుడు

గూగుల్ యాడ్ రెవెన్యూ రికవరీ

గూగుల్ యాడ్ రెవెన్యూ రికవరీ

కరోనా కారణంగా సెర్చింజన్ గూగుల్ యాడ్ సేల్స్ మార్చిలో పడిపోయాయి. జూన్-ఏప్రిల్ క్వార్టర్‌లో రీకవరీ అయ్యాయి. ఈ మేరకు గూగుల్ మాతృసంస్థ అల్పాబెట్ గురువారం ప్రకటించింది. అంతకుముందుతో పోలిస్తే రెండో క్వార్టర్‌లో ఆదాయం 2 శాతం క్షీణించింది. అయితే మార్కెట్ నిపుణులు 4 శాతం తగ్గుతుందని అంచనా వేశారు. ఈ లెక్కన గూగుల్ మంచి ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. సమీక్షా కాలంలో యూట్యూబ్ యాడ్ సేల్స్ 6 శాతం పెరిగాయి. మొత్తం క్వార్టర్ రెవెన్యూ 38.3 బిలియన్ డాలర్లుగా ఉంది. 2009 సంక్షోభం అనంతరం వృద్ధి రేటు నెమ్మదించడం ఇదే మొదటిసారి.

ఫేస్‌బుక్ రెవెన్యూ జూమ్

ఫేస్‌బుక్ రెవెన్యూ జూమ్

ఫేస్‌బుక్ ఆదాయం కూడా రెండో క్వార్టర్‌లో అంచనాలు మించాయి. 11 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో ఈ సంస్థ షేర్లు నిన్న 7 శాతం ఎగిశాయి. ఈ వృద్ధి గతంలో కంటే చాలా తక్కువ. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నిపుణులు అంచనాలు మించింది. 3 శాతం వృద్ధి ఉంటుందని భావించారు. ఫేస్‌బుక్ రెవెన్యూలో యాడ్ సేల్స్ ఎక్కువ. ఇది 10 శాతం వృద్ధి చెంది 18.3 బిలియన్ డాలర్లుగా ఉంది. మంత్లీ యాక్టివ్ యూజర్లు 2.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. దీనిని 2.6 బిలియన్లుగా అంచనా వేశారు.

అమెజాన్‌కు అదిరిపోయే ప్రాఫిట్

అమెజాన్‌కు అదిరిపోయే ప్రాఫిట్

అమెజాన్ ఈ క్వార్టర్‌లో మంచి లాభాలు నమోదు చేసింది. 26 ఏళ్ల ఈ సంస్థ చరిత్రలో మంచి ఫలితాలు సాధించింది. అమెజాన్ ఫలితాల నేపథ్యంలో షేర్లు 5 శాతం ఎగిశాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ఆన్ లైన్ వ్యాపారానికి డిమాండ్ పెరిగింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 1,75,000 మంది ఉద్యోగులను తీసుకుంది. అమెజాన్ రెవెన్యూ ఏకంగా 40 శాతం పెరిగి 88.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏడాది ప్రాతిపదికన నెట్ ఇన్‌కం రెండింతలు పెరిగింది.

ఆపిల్ అన్ని కేటగిరీలు అదుర్స్

ఆపిల్ అన్ని కేటగిరీలు అదుర్స్

కరోనా నేపథ్యంలో ఆపిల్ అన్ని విభాగాల్లోను వృద్ధిని సాధించింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్, లెర్నింగ్ ఫ్రమ్ హోమ్ వంటి వివిధ కారణాలతో డిమాండ్ పెరిగింది. ఆపిల్ ఫలితాలు సంతృప్తికరంగా ఉండటంతో ఈ కంపెనీ షేర్లు 6 శాతం ఎగిశాయి. ఏప్రిల్ నెలలో లాంచ్ చేసిన ఐఫోన్ ఎస్ఈ మంచి ఫలితాలు సాధించింది. ఆపిల్ చైనా ఐఫోన్ సేల్స్ 225 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఆపిల్ క్వార్టర్ రెవెన్యూ, ప్రాఫిట్ 59.69 బిలియన్ డాలర్లుగా ఉంది. నిపుణులు 52.25 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.

English summary

అంచనాలు మించిన గూగుల్, ఫేస్‌బుక్, ఆపిల్: డబుల్‌తో అమెజాన్ అదుర్స్ | Facebook, Amazon and Apple profit soar amid Covid 19 pandemic

Google's ad sales have recovered since plummeting in March during the coronavirus pandemic, parent Alphabet said on Thursday, easing concerns about its first quarterly sales slide in its 16 years as a public company.
Story first published: Friday, July 31, 2020, 14:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X