For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీఎఫ్ ఖాతాదారులు KYC అప్ డేట్ చేయాలి, లేదంటే..?

|

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) కస్టమర్లకు సంబంధించి క్లెయిమ్ చేయని డబ్బు రూ.58,000 కోట్లు ఉన్నట్లు తెలిపింది. కస్టమర్లపరంగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థ. కరోనా నేపథ్యంలో గతంలో క్లెయిమ్ చేయని వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో వారి బ్యాకు ఖాతా వివరాలను, కేవైసీ ప్రక్రియను అప్ డేట్ చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సూచిస్తోంది. అప్పుడే ఎలాంటి సమస్య లేకుండా పీఎఫ్ డబ్బులు వారి ఖాతాలో జమ అవుతాయని తెలిపింది.

ఇటీవల పలు బ్యాంకులు విలీనమయ్యాయి. దీంతో ఆ బ్యాంకుల IFSC కోడ్స్ మారే అవకాశముంది. కాబట్టి క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉండటానికి వారి వివరాలను అప్‌డేట్, కొత్త అకౌంట్స్‌ను లింక్ చేయాలని ఇటీవల విలీనమైన బ్యాంకుల కస్టమర్లను ఈపీఎఫ్ఓ కోరింది. ఒకవేళ పీఎఫ్ ఖాతాలను బ్యాంకులతో లింక్ చేయకుంటే ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు వారి మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా క్లెయిమ్ చేసుకోలేరు.

EPFO members should update KYC details on UAN portal

ప్రస్తుతం దేశంలో ఆరు కోట్లకు పైగా పీఎఫ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇంకా పీఎఫ్ కస్టమర్లు తమ ఖాతాలను ఆధార్‌తో లింక్ చేయకపోతే వెంటనే చేయాలి. లేదంటే వారు EPFO ఇతర సేవలను ఉపయోగించుకోలేరు.

English summary

పీఎఫ్ ఖాతాదారులు KYC అప్ డేట్ చేయాలి, లేదంటే..? | EPFO members should update KYC details on UAN portal

log in to your EPF account using your UAN and password and update your KYC details.
Story first published: Tuesday, June 29, 2021, 21:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X