EPFO Passbook:పీఎఫ్ పాస్ బుక్ కావాలా.. అయితే ఇలా చేయండి చాలు..
ఉద్యోగం చేసే వారందరికీ పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. ఉద్యోగుల జీతం నుంచి నెలనెలా కొంత మొత్తం పీఎఫ్ అకౌంట్ లో జమ అవుతుంది. అయితే కొన్ని కంపెనీలు పీఎఫ్ లో సరిగా డబ్బుల జమ చేయవు. మరి.. కంపెనీ వారు డబ్బు జమ చేశారో లేదో తెలుసుకోవాలంటే పాస్ బుక్ డౌన్ లోడ్ చేసుకోవాలి. పాస్ బుక్ కావాలంటే ముందుగా మీరు యూఏఎన్ నెంబర్ తెలుసుకోవాలి. యూఏఎన్ నెంబర్ మీ పే స్లిప్ లో ఉంటుంది. పే స్లిప్ లేనివారు హెచ్ఆర్ వద్ద యూఎన్ఏ నెంబర్ తీసుకోవాలి. యూఏఎన్ నెంబర్ తీసుకున్న తర్వాత నెట్ లో EPFO సైట్ లోకి వెళ్లాలి. సైట్ ఓపెన్ కాగానే అందులో ఆన్ లైన్ సర్వీస్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై కర్సర్ పెట్టగానే ఎంప్లాయర్, ఎంప్లాయిస్ అని వస్తుంది. అప్పుడు ఎంప్లాయిస్ పై క్లిక్ చేయాలి. దాని క్లిక్ చేయగానే పాస్ బుక్, యూఏఎన్ ఆన్ లైన్ సర్వీస్ అనే ఆప్షన్లు ఉంటాయి. మీరు ఇంతకుముందే యూఏఎన్ నెంబర్ తో లాగిన్ అయితే డైరెక్ట్ గా పాస్ బుక్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ యూఏఎన్ నెంబర్, పాస్ వర్డ్ టైప్ చేసి లాగిన్ అవ్వాలి. అక్కడ మీ పాస్ బుక్ చూపిస్తుంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఇంతకుముందు లాగిన్ చేయనివారు యూఏఎన్ ఆన్ లైన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు యాక్టివ్ యూఏఎన్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత యూఏఎన్ నెంబర్, క్యాప్చ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరు, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సడ్మిట్ టేయాలి. ఆ తర్వాత మీ మొబైల్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్ కు పాస్ వర్డ్ వస్తుంది. ఆ తర్వాత మీరు యూఏఎన్ నెంబర్, మీ ఫోన్ కు వచ్చిన పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీరు మీ పాస్ వర్డ్ మార్చుకోవాలి. ఆ తర్వాత మీరు కేవైసీ డిటైల్స్ ఎంటర్ చేయ్యొచ్చు. ఈ నామినీ యాడ్ చేయ్యొచ్చు. పాస్ వర్డ్ మార్చుకున్న ఆరు గంటల తర్వాత మళ్లీ EPFO సైట్ లోకి వెళ్లి ఆన్ లైన్ సర్వీస్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఎంప్లాయిస్ పై క్లిక్ చేయాలి. దాని క్లిక్ చేయగానే పాస్ బుక్ అని వస్తుంది. దానిపై క్లిక్ చేసి యూఏన్ నెంబర్, పాస్ వర్డ్ టైప్ చేస్తే లాగిన్ అవుతుంది. అప్పుడు మీరు మీ పాస్ బుక్ డౌన్ లోడ్ చేసుకోవాచ్చు. పాస్ బుక్ లో ఎంప్లాయర్ షేర్, ఎంప్లాయి షేర్, పెన్షన్ వివరాలు ఉంటాయి. ఏ నెల ఎంత కంట్రిబ్యుట్ చేశారో అందులో ఉంటుంది.

మిస్డ్ కాల్
మీరు ఇలా లాగిన్ అయి కాకుండా మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. మీరు మీ రిజిస్టర్ మొబైల్ నుంచి 01122901406 కు మిస్డ్ కాల్ ఇస్తే మీ ఫోన్ కు ఎంత బ్యాలెన్స్ ఉన్నాయో ఎస్ఎంఎస్ వస్తుంది.

ఎస్ఎంఎస్
మిస్డ్ కాల్ ద్వారా కాకుండా ఎస్ఎంఎస్ ద్వారా కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. మీరు మీ రిజిస్టర్ మొబైల్ నుంచి EPFOHO UAN అని టైప్ చేసి 7738299899 కు ఎస్ఎంఎస్ కు పంపాలి. ఆ తర్వాత మీ ఫోన్ కు ఎంత బ్యాలెన్స్ ఉన్నాయో ఎస్ఎంఎస్ వస్తుంది.

ఉమంగ్ యాప్
ఇలా కాకుండా ఉమంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. మీరు గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లి ఉమంగ్ యాప్ డౌన్ లోడ్ చే సుకోవాలి. ఆ తర్వాత మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఉమంగ్ యాప్ ఓపెన్ అవుతుంది. అందులో చాలా సేవలు ఉంటాయి. మీరు ఈపీఎఫ్ పై క్లిక్ చేస్తే యూఏఎన్ నెంబర్ అడుగుతుంది. దాన్ని ఎంటర్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మీరు మీ పాస్ బుక్ చూసుకోవచ్చు.