For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాల్యుయేషన్‌పై డౌట్స్, భారీగా పడిపోయిన బిట్‌కాయిన్: ఎలాన్ మస్క్ సంపద డౌన్

|

టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ పైన చేసిన ట్వీట్ ఖరీదు 15 బిలియన్ డాలర్లు! ఈ క్రిప్టో వ్యాల్యూ పైన అనుమానాలు వస్తుండటంతో ఏకంగా 17 శాతం క్షీణించి 45,000 డాలర్లకు పడిపోయింది. గతవారం ఓ సమయంలో 58వేల డాలర్లు దాటిన బిట్ కాయిన్ ఇప్పుడు 45వేల స్థాయికి పడిపోవడం గమనార్హం. అంతేకాదు బిట్ కాయిన్ రైవల్ ఎథెర్ వ్యాల్యూ భారీగా పెరుగుతుందని మస్క్ ట్వీట్ చేశారు. ఇది టెస్లా షేర్ల పైన కూడా ప్రభావం చూపింది. దీంతో మస్క్ సంపద ఏకంగా 15 బిలియన్ డాలర్లు కరిగిపోయింది.

ప్రపంచంలోనే అతి ఖరీదైన ఈ బిట్ కాయిన్ గత కొద్ది రోజుల్లో ఈ స్థాయిలో పడిపోవడం ఇదే మొదటిసారి. 58వేల డాలర్ల నుండి 45 వేల డాలర్లకు పడిపోయినప్పటికీ, ఈ ఏడాది 60 శాతం లాభపడినట్లే. బిట్ కాయిన్ వ్యాల్యూ సోమవారమే రికార్డ్ గరిష్టం నుండి పడిపోయింది. గతవారం దీని వ్యాల్యూ ఏకంగా 58,354 డాలర్లకు చేరుకుంది. మన కరెన్సీలో రూ.42 లక్షల వరకు. అయితే సోమవారం బిట్ కాయిన్ వ్యాల్యూ తగ్గింది. అంతర్జాతీయంగా బిట్ కాయిన్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. బిట్ కాయిన్ సోమవారం 6 శాతం మేర క్షీణించింది. నేడు మరింత భారీగా పతనమైంది.

 Elon Musks tweet on Bitcoin costs him $15 billion in a day

బిట్ కాయిన్ మార్కెట్ వ్యాల్యూ శనివారం ఏకంగా లక్షకోట్ల డాలర్లు దాటిన విషయం తెలిసిందే. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా ఇంక్ 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. అలాగే మాస్టర్ కార్డ్ వంటి సంస్థలు క్రిప్టోకరెన్సీని అమోదించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలోనే క్రిప్టోకరెన్సీ వ్యాల్యూ భారీగా పెరిగింది. కానీ అనుమానాలు వస్తుండటంతో పడిపోయింది.

English summary

వ్యాల్యుయేషన్‌పై డౌట్స్, భారీగా పడిపోయిన బిట్‌కాయిన్: ఎలాన్ మస్క్ సంపద డౌన్ | Elon Musk's tweet on Bitcoin costs him $15 billion in a day

Elon Musk has been one of the biggest supporters of cryptocurrency. Tesla chief’s tweets in support of Bitcoin and Dogecoin along with Tesla’s investment have boosted the prices of major cryptocurrencies in the past few weeks, However, one of his recent tweets have cost Musk a whopping $15.2 billion in a day.
Story first published: Tuesday, February 23, 2021, 20:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X