టాప్ 10లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.34 లక్షల కోట్లు జంప్
టాప్ 10లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.2.34 లక్షల కోట్లు పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ భారీగా లాభపడ్డాయి. 30 షేర్ బీఎస్ఈ బెంచ్ మార్క్ సెన్సెక్స్ గతవారం 1478 పాయింట్లు లేదా 2.47 శాతం లాభపడింది. అంతకుముందువారం ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.50 లక్షల కోట్లు పెరిగింది. అప్పుడు కూడా అత్యధికంగా లాభపడిన కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ నిలిచాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.17 లక్షల కోట్లు దాటింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ క్యాప్ రూ.14.50 లక్షల కోట్ల మార్కును దాటింది. వరుసగా 4 వారాలుగా మార్కెట్ క్యాప్ పెరుగుతోంది.

రిలయన్స్
- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.69,503.71 కోట్లు పెరిగి రూ.17,17,265.94 కోట్లకు చేరుకుంది.
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.48,385.63 కోట్లు లాభపడి రూ.8,10,927.25 కోట్లకు చేరింది.
- టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.42,317.15 కోట్లు ఎగిసి రూ.14,68,245.97 కోట్లకు పెరిగింది.
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.21,125.41 కోట్లు పెరిగి రూ.4,91,426.13 కోట్లకు ఎగిసింది.
- ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,650.77 కోట్లు పెరిగి రూ.5,69,511.37 కోట్లకు చేరుకుంది.
- SBI మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,127.22 కోట్లు పెరిగి రూ.4,53,593.38 కోట్లకు ఎగిసింది.
- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,291.28 కోట్లు ఎగిసి రూ.4,72,686.80 కోట్లకు చేరుకుంది.
- భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ రూ.8,760.41 కోట్లు పెరిగి రూ.3,95,810.41 కోట్లకు చేరింది.

ఇవి కిందకు
అదే సమయంలో HDFC బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ క్షీణించింది.
- హిందూస్తాన్ యూనీ లీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.12,217.88 కోట్లు క్షీణించి రూ.5,55,560.85 కోట్లకు తగ్గింది.
- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,854.33 కోట్లు క్షీణించి రూ.8,56,439.28 కోట్లుగా నమోదయింది.

టాప్ టెన్ కంపెనీలు
టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, ICICI బ్యాంకు, HDFC, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి.