For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Layoff: మూడోసారి వేటు మెుదలెట్టిన కంపెనీ.. ఉద్యోగాలు ఫసక్.. ఉద్యోగుల కన్నీళ్లు..

|

Vedantu Layoff: కరోనా చాలా రంగాల్లోని వ్యాపారాలను నాశనం చేసినప్పటికీ.. కొన్ని వ్యాపారాలు మాత్రం మంచి వృద్ధిని చూశాయి. వారి వ్యాపారం ఆ కాలంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. కానీ ఇప్పుడు ఆ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో తెలియక ఆందోళనలో ఉన్నారు.

ఉద్యోగుల తొలగింపు..

ఉద్యోగుల తొలగింపు..

ఇప్పటి వరకు మవం మాట్లాడుకుంటున్నది భారతదేశంలో అనతి కాలంలో పుట్టుకొచ్చిన ఎడ్‌టెక్ స్టార్టప్‌ వ్యాపారాల గురించే. అవును కరోనా కట్టిన అభివృద్ధి మేడలు ఇప్పుడు కుప్పకూలుతున్నాయి. ఈ రంగంలోని కంపెనీలు దాదాపు 7,000 మందిని తొలగించాయి. ఈ తొలగింపులు ఇప్పటికీ కొనసాగటం ఉద్యోగులకు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి.

తగ్గిన పెట్టుబడులు..

తగ్గిన పెట్టుబడులు..

ప్రస్తుతం కరోనా తర్వాత డిమాండ్ తగ్గటంతో పాటు.. పెట్టుబడుల రాక మందగించటంతో లిక్విడిటీ క్రంట్ ఏర్పడింది. దీంతో కంపెనీలు ప్రస్తుతం ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. అయితే.. టైగర్ గ్లోబల్ మద్దతుగల వేదాంతు ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కరోనా అనంతర వృద్ధిని పెంచడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయినప్పటికీ డిమాండ్ స్థిరంగా ఉన్నందున ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా ఈ ఏడాది మూడోసారి కంపెనీ ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది.

ఉద్యోగాలు ఫసక్..

ఉద్యోగాలు ఫసక్..

బెంగళూరు కేంద్రంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఎడ్ టెక్ స్టార్టప్ వేదాంతు మొత్తం ఉన్న 3300 మంది ఉద్యోగుల్లో 11.6% అంటే 385 మందిని తొలగించింది. అలాగే తొలగించిన ఉద్యోగులకు పరిహారం కూడా చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీని వీడుతున్న ఉద్యోగులు కొత్త ఉద్యోగం వెతుక్కునే క్రమంలో పరిహారం ఉపసమనాన్ని కలిగిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే ఈ తొలగింపుల్లో ఎక్కువగా సేల్స్, లెర్నింగ్ విభాగాల్లోని ఉద్యోగులు ప్రభావితం అవుతారని కంపెనీ హెచ్ఆర్ విభాగం తెలిపింది.

క్రమంగా తొలగింపులు..

క్రమంగా తొలగింపులు..

కంపెనీకి గత మే నెలలో మెుత్తంగా 5600 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. ఆ సంఖ్య ప్రస్తుత తొలగింపులకు ముందు 3300కి చేరుకుంది. అంటే దాదాపుగా 50 శాతం ఖర్చులను కంపెనీ తగ్గించుకుంది. మే నెలలో మెుదటిసారి 424 మంది ఉద్యోగులను తొలగించిన కంపెనీ ఆగష్టులో 100 మందిని ఇంటికి పంపింది. అయితే తాజాగా మూడో విడతలో కంపెనీ ఏకంగా 385 మందిని తొలగించటంతో తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మరో పక్క మాంద్యం కూడా కంపెనీల ఆర్థిక బలంపై ప్రభావాన్ని చూపుతోందని స్టార్టప్ వర్గాలు చెబుతున్నాయి.

ఇదే ఆఖరిదా..?

ఇదే ఆఖరిదా..?

ఈ రంగంలోని బైజూ కంపెనీ దాదాపు 2500 మంది ఉద్యోగులను తొలగించగా.. అన్ అకాడమీ 1200 మందికి ఉద్వాసన పలికింది. ఇదే క్రమంలో.. లీడ్, టాపర్, వైట్ హ్యాట్ జూనియర్, సూపర్ లెర్న్ సహా మరిన్ని ఎడ్ టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించుకున్నాయి. అలాగే ప్రపంచంలోని అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కు చెందిన ఎడ్ టెక్ విభాగాన్ని కంపెనీ పూర్తిగా మూసివేస్తున్నట్లు కంపెనీ కొద్ది రోజుల కిందట సంచలన ప్రకటన చేసింది.

అయితే ఈ తొలగింపుల ట్రెండ్ మరింత కాలం మార్కెట్లో ఉండవచ్చని.. బవిశా ఇది ఆఖరిది కాకపోవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఉద్యోగులకు మాత్రం దినదిన ఘండంలాగే పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోక తప్పదు.

Read more about: vedantu layoffs jobs startup
English summary

Layoff: మూడోసారి వేటు మెుదలెట్టిన కంపెనీ.. ఉద్యోగాలు ఫసక్.. ఉద్యోగుల కన్నీళ్లు.. | Edtech Unicorn Vedantu layoffs employees again for third time this year

Edtech Unicorn Vedantu layoffs employees again for third time this year
Story first published: Thursday, December 8, 2022, 10:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X