For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Economic Survey 2022: ఆర్థిక సర్వే ప్రాముఖ్యత ఏమిటి? నాటి నుండి ఇలా...

|

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31, 2022 (సోమవారం) ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను (లోకసభ, రాజ్యసభ) ఉద్దేశించి నేడు ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆర్థిక సర్వేను (ఎకనమిక్ సర్వే) ప్రవేశపెడతారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతున్నారు. దీనికి ముందు ఎకనమిక్ సర్వేను సమర్పిస్తారు. ఈ ఆర్థిక సర్వేలో వృద్ధి రేటు అంచనాలను 9 శాతంగా ఉండవచ్చు. ఆసియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ వేగంగా రికవరీ అవుతోంది.

ఆర్థిక సర్వే ఏమిటి, అంచనాలు

ఆర్థిక సర్వే ఏమిటి, అంచనాలు

ఆర్థిక సర్వేను బడ్జెట్‌కు ముందు సభకు సమర్పిస్తారు. గత ఆర్థిక ఏడాది ఎలా కొనసాగిందో పూర్తి వివరాలతో కూడిన డాక్యుమెంట్ ఇది. అలాగే అభివృద్ధి కోసం ఏం చేయాలో వెల్లడిస్తుంది. ఈ సర్వేను సాధారణంగా చీఫ్ ఎకనమిస్ట్ అడ్వైజర్ (CEA) ఆధ్వర్యంలో తయారు చేస్తారు. అయితే ఈసారి సీఈవో గైర్హాజరీలో తయారయింది. ఈ సర్వే తయారీ అనంతరం జనవరి 28న కేంద్రం అనంత నాగేశ్వరన్‌ను కొత్త సీఈఏగా నియమించింది.

సీఈఏ గైర్హాజరీలో తయారయిన ఈ ఆర్థిక సర్వే సింగిల్ వ్యాల్యూమ్ అని తెలుస్తోంది. ఈ సర్వేలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును 9 శాతంగా అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ 9.2 శాతం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9.5 శాతంగా అంచనా వేస్తోంది.

గత బడ్జెట్‌కు ముందు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే భారత వృద్ధి రేటును 11 శాతంగా అంచనా వేసింది.

ఆర్థిక సర్వేలో వ్యవసాయం, పరిశ్రమ, మ్యానుఫ్యాక్చరింగ్, ఎంప్లాయిమెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫారెన్ ఎక్స్చేంజ్, ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్, ఇతర అన్ని రంగాలకు చెందిన ఫిగర్స్ ఉంటాయి. పాలసీ ఇనిషియేటివ్స్‌ను హైలెట్ చేస్తారు. ప్రభుత్వం తీసుకునే చర్యలను వెల్లడిస్తుంది.

అప్పటి నుండి ఇలా...

అప్పటి నుండి ఇలా...

బడ్జెట్ సంప్రదాయంలో భాగంగా ఆర్థిక సర్వేను 1950-51 నుండి ప్రవేశ పెడుతున్నారు. 1964 వరకు దీనిని బడ్జెట్‌తో పాటు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత నుండి బడ్జెట్‌కు ముందు దీనిని ప్రవేశపెడుతున్నారు. ఆర్థిక సర్వే అంటే భారత ఆర్థిక వ్యవస్థకు రోడ్ మ్యాప్ వంటిది. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక పరిస్థితిని వెల్లడిస్తుంది. అలాగే, ఏం చేయాలో తెలియజేస్తుంది. ఈ సర్వేను ఎకనమిక్స్ డ్విజన్ ఆఫ్ ది డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్ (DEA) డెవలప్ చేస్తుంది. చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ ఆధ్వర్యంలో సిద్ధం చేస్తారు.

ప్రాముఖ్యత, ప్రయోజనం

ప్రాముఖ్యత, ప్రయోజనం

ఆర్థిక సర్వే వివిధ ఆర్థిక కారకాలలో ట్రెండ్స్‌ను విశ్లేషిస్తుంది. పెట్టుబడులను హైలెట్ చేస్తుంది. అలాగే ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అవసరమైన స్కీమ్స్, సంస్కరణలను సూచిస్తుంది. వచ్చే సంవత్సరం ఆర్థిక పరిస్థితి ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎలా సాగుతుందనే డేటాతో పాటు ఆర్థిక అంచనాలను అందిస్తుంది.

English summary

Economic Survey 2022: ఆర్థిక సర్వే ప్రాముఖ్యత ఏమిటి? నాటి నుండి ఇలా... | Economic Survey 2022: Know its history, significance and purpose

A long-standing Budget tradition, the Economic Survey has been presented since 1950-51. Until 1964, it was tabled alongside the budget. Since then, the tradition has been for the FM to present the survey a day before the budget.
Story first published: Monday, January 31, 2022, 8:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X