For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్థిక వ్యవస్థ అంచనాకు మించి కోలుకుంటోంది కానీ..: శక్తికాంతదాస్

|

ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దాని కంటే వేగంగా వృద్ధి చెందుతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం అన్నారు. పండుగ సీజన్ ముగియడంతో డిమాండ్ సుస్థిరత పైన ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా వేగవంతం కావడంతో వృద్ధి అంచనాలు పెరుగుతున్నాయని, కానీ కరోనా కేసులు వృద్ధికి నష్టాన్ని కలిగిస్తోందన్నారు. భారత ఆర్థిక కార్యకలాపాలు, వ్యవస్థ మాత్రం ఊహించిన దాని కంటే వేగంగా రికవరీ అవుతోందన్నారు. పండుగ సీజన్ అనంతరం డిమాండ్ సుస్థిరతపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

టెలికం ఛార్జీలు పెంచకతప్పదు, కానీ: ఎయిర్‌టెల్ మిట్టల్, 5Gలో చైనా కంపెనీలపై...టెలికం ఛార్జీలు పెంచకతప్పదు, కానీ: ఎయిర్‌టెల్ మిట్టల్, 5Gలో చైనా కంపెనీలపై...

కొనుగోలు శక్తి స్థిరత్వ పట్ల అప్రమత్తత

కొనుగోలు శక్తి స్థిరత్వ పట్ల అప్రమత్తత

ఫారెన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన ఆఫ్ ఇండియా(FEDAI) 4వ వార్షికోత్సవంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మాట్లాడారు. 2020-21 ఆర్థిక సంవత్సరంమొదటి త్రైమాసికంలో వృద్ధి మైనస్ 23.9 శాతం నమోదు చేసిన తర్వాత రెండో త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా కోలుకుంటున్నాయని చెప్పారు. ఇటీవల పలు ఆర్థిక దేశాల్లో, మన దేశంలోని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమన్నారు. పండుగ సీజన్ తర్వాత కొనుగోలు శక్తి స్థిరత్వం పట్ల జాగ్రత్తగా ఉండటంతో పాటు టీకా చుట్టూ ఉన్న మార్కెట్ అంచనాలను తిరిగి అంచనా వేయాలన్నారు.

మరింత పురోగతి

మరింత పురోగతి

ప్రపంచ దేశాల మాదిరిగా భారత ఆర్థిక వ్యవస్థ కూడా క్షీణతను ఎదుర్కొంటోందని శక్తికాంతదాస్ అన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 23.9 శాతం ప్రతికూలత నమోదు చేయగా, 2021 ఆర్థిక సంవత్సరానికి ఇది మైనస్ 9.5 శాతానికి తగ్గనున్నట్లు అంచనా వేశామన్నారు. కానీ లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో పాటు పండుగల సీజన్లో కోలుకోవడం చూస్తున్నామని, రెండో క్వార్టర్‌లో సాధారణంగానే కనిపించిందని, ప్రస్తుతం అంచనా వేసిన దాని కంటే మరింత పురోగతి కనిపిస్తోందన్నారు.

క్లోజ్డ్ ఆర్థిక వ్యవస్థ నుండి...

క్లోజ్డ్ ఆర్థిక వ్యవస్థ నుండి...

గత మూడు దశాబ్దాలుగా క్లోజ్డ్ ఆర్థిక వ్యవస్థ నుండి ప్రపంచానికి అనుసంధానించబడిన వ్యవస్థగా భారత్ ఎదిగిందని, అంతకుముందు కంటే అంతర్జాతీయ ట్రాన్సాక్షన్స్, మూలధన ప్రవాహాల పెరిగాయన్నారు. భారత్‌లో చాలా రంగాల్లో ఈ రోజు విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్నారు. అలాగే విలీన సంస్థల ద్వారా నికర వ్యాల్యూ పెరుగుతోందన్నారు. ప్రస్తుతం వృద్ధి కొనసాగుతున్న సమయంలో యూరోప్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో వైరస్ విజృంభించడం రికవరీపై ప్రభావం చూపే ప్రమాదముందన్నారు.

English summary

ఆర్థిక వ్యవస్థ అంచనాకు మించి కోలుకుంటోంది కానీ..: శక్తికాంతదాస్ | Economic recovery stronger than expected: RBI Governor Shaktikanta Das

Reserve Bank of India governor Shaktikanta Das on November 26, raised concerns over demand sustainability with the close of the festive season and rise in Covid-19 infections in India which pose downside risks to growth.
Story first published: Thursday, November 26, 2020, 16:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X