For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టూరిజం కుదేల్: పబ్లిక్ ఇష్యూలోకి ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ: త్వరలో ఐపీఓ

|

ముంబై: దేశీయ ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ ఈజీ మై ట్రిప్.. త్వరలో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)ను ప్రకటించబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసుకుంది. బోంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో లిస్ట్ కానుంది. వచ్చేనెల 31వ తేదీ నాటికి పబ్లిక్ ఇష్యూను జారీ చేయడానికి అందుబాటులో గల అవకాశాలను పరిశీలిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పర్యాటక రంగం కుదేల్ కావడం వల్ల ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీలు ఆర్థికంగా నష్టాన్ని చవి చూస్తున్నాయి.

 థర్డ్ పార్టీకి చెల్లుచీటి: సొంతంగా ఐఆర్‌సీటీసీ పేమెంట్ గేట్‌వే: క్షణాల్లో రీఫండ్ థర్డ్ పార్టీకి చెల్లుచీటి: సొంతంగా ఐఆర్‌సీటీసీ పేమెంట్ గేట్‌వే: క్షణాల్లో రీఫండ్

వాటిని భర్తీ చేసుకోవడానికి పబ్లిక్ ఇష్యూలను జారీ చేయడానికి ప్రాధాన్యత ఇస్తోన్నాయి. ఈ క్రమంలోనే- మేక్ మై ట్రిప్ కంపెనీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)ను ప్రకటించాలని నిర్ణయించుకుంది. దీనిపై సెక్యూరిటీ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి ప్రతిపాదనలను పంపించింది. నిజానికి- కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ముందే అంటే గత ఏడాది జనవరి 30వ తేదీ నాటికి షేర్ మార్కెట్‌లోప్రవేశించాలని భావించింది. దీనికి సన్నాహాలు పూర్తి చేసుకుంది.

EaseMyTrip plans Rs 510 cr IPO amid slump in travel by March end

2020 జనవరి 30వ తేదీన సెబీకి ప్రతిపాదనలను పంపించింది. ఆ తరువాత స్టాక్ మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వలేకపోయింది. ఈ సారి తప్పనిసరిగా పబ్లిక్ ఇష్యూను జారీ చేసేలా సన్నాహాలు పూర్తి చేసింది. మొత్తం 510 కోట్ల రూపాయల మేర నిధులను పబ్లిక్ ఇష్యూ రూపంలో మార్కెట్ నుంచి మొబిలైజ్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నిరోధించడానికి విధించిన లాక్‌డౌన్ పరిస్థితుల వల్ల ఈజీ మై ట్రిప్ నష్టాలను చవి చూసింది.

గత ఏడాది డిసెంబర్ నాటికి ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాల్లో నష్టాలు నమోదు అయ్యాయి. 62 శాతం మేర బుకింగ్‌లు క్షీణించాయి. 2019 డిసెంబర్ నాటికి 3,179.8 కోట్ల రూపాయల రెవెన్యూ నమోదు కాగా.. 2020 డిసెంబర్ నాటికి ఆ సంఖ్య 1,220.7 కోట్లకు పడిపోయింది. బుకింగ్ వాల్యూమ్ 4.05 మిలియన్ల నుంచి 1.77 మిలియన్లకు దిగజారాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పబ్లిక్ ఇష్యూను జారీ చేయాలని, దాని ద్వారా 510 కోట్ల రూపాయలను సేకరించాలని భావిస్తోంది. షేర్ల విలువ ఎంత అనేది ఇంకా ఖరారు కాలేదు.

English summary

టూరిజం కుదేల్: పబ్లిక్ ఇష్యూలోకి ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ: త్వరలో ఐపీఓ | EaseMyTrip plans Rs 510 cr IPO amid slump in travel by March end

EaseMyTrip is set to become the first Indian online travel firm to list on the local bourses as it prepares to launch a Rs 510 crore IPO by the end of March, said two people with direct knowledge of the matter.
Story first published: Saturday, February 13, 2021, 15:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X