For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Paras Defence: బ్లాక్ బస్టర్: ముందే వచ్చిన దీపావళి: ఇప్పుడే అమ్ముకోవచ్చా?

|

ముంబై: పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్.. దేశీయ మార్కెట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. వస్తూ వస్తూనే షేర్ హోల్డర్లను లక్షాధికారులను చేసింది. లిస్టింగ్ అయిన తొలి రోజే ఆ షేర్ విలువ మూడింతలు పెరిగింది. వేల రూపాయల్లో షేర్ హోల్డర్లు పెట్టిన పెట్టుబడి ఒక్కరోజులోనే లక్షల రూపాయల్లోకి వెళ్లింది. ఒక్కో షేర్ మీద 185 శాతం మేర లాభాలను పంచిందీ పరాస్ డిఫెన్స్. 2011 తరువాత ఈ స్థాయిలో రికార్డు స్థాయిలో షేర్ హోల్డర్లకు లాభాలను పంచి పెట్టిన లిస్టెడ్ కంపెనీ ఇదొక్కటే.

CNG and PNG prices: కుకింగ్ మరింత భారంన్యూఢిల్లీ: ఒక్కరోజు వ్యవధిలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, పైప్డ్ నేచురల్CNG and PNG prices: కుకింగ్ మరింత భారంన్యూఢిల్లీ: ఒక్కరోజు వ్యవధిలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, పైప్డ్ నేచురల్

175 రూపాయల షేర్..

పరాస్ డిఫెన్స్ యాజమాన్యం దాఖలు చేసిన ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఇష్యూ ప్రైమరీ దశలో ఒక్కో షేర్ విలువ 175 రూపాయలు. స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో లిస్టింగ్ అయిన తరువాత దీని విలువ రూ.498.75 పైసలకు పెరిగింది. ఒక్కో షేర్ మీద మూడు రెట్ల కంటే అధిక ఆదాయాన్ని చవి చూసినట్టయింది ఈ కంపెనీ షేర్ హోల్డర్లకు. లిస్టింగ్ అయిన తరువాత ఓపెనింగ్‌లో ఈ షేర్ ధర 475 రూపాయలకు వెళ్లింది. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి రూ.498.75 పైసల వద్ద నిలిచింది.

సెకెండరీలో కొనాలంటే..

సెకెండరీలో పరాస్ డిఫెన్స్ షేర్లను కొనుగోలు చేయాలంటే.. ఒక్కో షేర్ మీద రూ.498.75 పైసలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఐపీఓ ప్రైమరీ దశలో దీని విలువ 175 రూపాయలు. కంపెనీ లాటరీ పద్ధతిన ఈ షేర్లను అలాట్ చేసింది షేర్ హోల్డర్లకు. ప్రైమరీదశలో 175 రూపాయలతో పరాస్ డిఫెన్స్ షేర్లను కొన్న వారు ఇప్పుడు దాన్ని రూ.498.75 పైసలకు అమ్ముకోవడానికి వీలు ఉంది. ట్రేడ్ టు ట్రేడ్ సెగ్మెంట్‌లో 250 కోట్ల రూపాయల ఇష్యూలను జారీ చేసిందీ కంపెనీ మేనేజ్‌మెంట్.

రూ.14,875 పెట్టుబడి పెట్టి ఉంటే..

ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌లో పరాస్ డిఫెన్స్ లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన ఒక్కో లాట్ సైజ్ 85 షేర్లు. ఒక లాట్‌ను కొనుగోలు చేయాలీ అంటే ప్రైమరీ దశలో 14,875 రూపాయలను ఖర్చు చేశారు కొనుగోలుదారులు. ఈ లాట్ అలాట్ అయిన వారి పెట్టుబడి కొన్ని గంటల వ్యవధిలో మూడింతలయింది. లిస్టింగ్ అయిన తరువాత ఈ లాట్ వేల్యూ రూ. 42,393.75 పైసలకు చేరింది. వారి ఆదాయం 14,875 రూపాయల నుంచి రూ. 42,393.75 పైసలకు చేరింది.

ఇప్పుడే అమ్ముకోవచ్చా?

పరాస్ డిఫెన్స్ బ్లాక్ బస్టర్ షేర్లను ఇప్పుడే అమ్ముకోవచ్చా? అనే ప్రశ్నకు మార్కెట్ నిపుణులు ఇచ్చే సమాధానం.. వద్దు అనే. ఈ షేర్ల వేల్యూ మరింత పెరగడానికి అవకాశం ఉందని వారు అంచనా వేస్తోన్నారు. ఇప్పుడున్న ఈ వేల్యూలో కనీసం 50 శాతం మేర పెరుగుదల ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. లాంగ్ టర్మ్ కోసం అద్భుతంగా ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనలో ప్రైవేట్ రంగానికి ద్వారాలు తెరిచినందున.. మున్ముందు పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్‌కు మరింత ఆదరణ ఉంటుందని విశ్లేషిస్తున్నారు.

2011 తరువాత

ఈ 10 సంవత్సరాల వ్యవధిలో పరాస్ డిఫెన్స్ స్థాయిలో తొలి రోజే షేర్ హోల్డర్లకు లాభాలను పంచి పెట్టిన సంస్థ మరొకటి లేదు. ఇదివరకు సలాసర్ టెక్నో ఇంజినీరింగ్, అస్ట్రాన్ పేపర్, బర్గర్ కింగ్ ఇండియా, ఐఆర్‌సీటీసీ, హ్యాపీయెస్ట్ మైండ్స్, అవెన్యూ సూపర్ మార్కెట్స్, తత్వ చింతన్ ఫార్మా కెమికల్స్ లిస్టింగ్ అయిన తొలి రోజే 100 శాతం లాభాలను పంచినప్పటికీ.. పరాస్ డిఫెన్స్ స్థాయిలో లేవు. ఈ కంపెనీ మాత్రం 185 శాతం మేర బెనిఫిట్స్ ఇచ్చింది.

సలాసర్ రెండో స్థానంలో

పరాస్ డిఫెన్స్ బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇవ్వడంతో సలాసర్ టెక్నో ఇంజినీరింగ్ రెండో స్థానంలోకి వెళ్లింది. సలాసర్ టెక్నో ఇంజినీరింగ్.. లిస్ట్ అయిన తొలి రోజే 140 శాతం మేర ప్రాఫిట్‌ను పంచింది షేర్ హోల్డర్లకు. అపోలో మైక్రోసాఫ్ట్ 69, అస్ట్రాన్ పేపర్స్ 130 శాతం, ఎంటీఏఆర్ టెక్నాలజీస్ 85 శాతం మేర ప్రాఫిట్ ఇచ్చాయి. వాటన్నింటినీ ఒక్క ఉదుటన దాటేసింది పరాస్ డిఫెన్స్. ఇప్పట్లో మరో కంపెనీ దీని రికార్డును అంధిగమించలేదేమో అనే స్థాయికి చేరింది.

అసలేంటీ పరాస్ డిఫెన్స్

పరాస్ డిఫెన్స్.. రక్షణ, అంతరిక్ష పరిశోధన ఇంజినీరింగ్ సెగ్మెంట్‌లో రాణిస్తోంది. ఆయా రంగాలకు కావాల్సిన పరికరాల డిజైనింగ్, డెవలపింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, టెస్టింగ్‌ సెక్టార్‌లో ఉన్న కంపెనీ ఇది. ప్రైవేట్ సెక్టార్‌లో ఇండిజీనియస్లీ డిజైన్డ్ అండ్ డెవలపింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ (ఐడీడీఎం) గుర్తింపు ఉన్న ఏకైక కంపెనీ. డిఫెన్స్ సెక్టార్, డిఫెన్స్ అండ్ స్పేస ఆప్టిక్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, ఎలెక్ట్రో-మాగ్నిటిక్ పల్స్ ప్రొటెక్షన్ సొల్యూషన్ అండ్ హెవీ ఇంజినీరింగ్‌లో టాప్ కంపెనీగా కొనసాగుతోంది.

రెండు చోట్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్

పరాస్ డిఫెన్స్‌కు రెండు చోట్ల తయారీ యూనిట్లు ఉన్నాయి. నవీ ముంబై సమీపంలోని నేరుల్, థానే వద్ద గల అంబర్‌నాథ్ వద్ద తయారీ యూనిట్లను ఏర్పాటు చేసిందీ కంపెనీ మేనేజ్‌మెంట్. నేరుల్ యూనిట్‌లో అడ్వాన్స్డ్ నానో టెక్నాలజీతో హైక్వాలిటీ ఆప్టిక్స్‌ తయారవుతాయి. అంబర్‌నాథ్ ప్లాంట్‌లో అంతరిక్ష పరిశోధనకు సంబంధించిన పరికరాలను తయారు చేస్తుందీ కంపెనీ.

English summary

Paras Defence: బ్లాక్ బస్టర్: ముందే వచ్చిన దీపావళి: ఇప్పుడే అమ్ముకోవచ్చా? | Early Diwali for Paras Defence and Space Tech IPO holders as it gets trippled of their investments

Early Diwali for Paras Defence and Space Tech IPO holders as it gets trippled of their investments.
Story first published: Saturday, October 2, 2021, 12:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X