For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం: రోజుకు 9 గంటలు వర్కింగ్ హవర్స్, 12 గంటలు మించొద్దు..

|

న్యూఢిల్లీ: మన దేశంలో వారానికి ఆరు రోజులు... రోజుకు 8 గంటలు వర్కింగ్ డేస్‌గా ఉంది. నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ రూల్ మార్చే యోచన చేస్తోంది. దేశవ్యాప్తంగా కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికుల పని గంటలను మార్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న వర్కింగ్ సమయాన్ని పెంచనున్నారట. ఉద్యోగులకు లేదా కార్మికులకు కనీస వేతనం, దేశవ్యాప్తంగా ఒకే రోజు శాలరీ క్రెడిట్ అంశాలతో పాటు వర్కింగ్ సమయాన్ని కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి.

పని గంటలు 8 నుంచి 9 గంటలకు...

పని గంటలు 8 నుంచి 9 గంటలకు...

ఇదే జరిగితే కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే వేతన జీవులు, కార్మికుల కనీస పని గంటలు ప్రస్తుతం ఉన్న 8 గంటల నుంచి 9 గంటలకు మారనున్నాయి. వేతన కోడ్ 2019 అమలులో భాగంగా కనీస వేతనాలు, కరువు భత్యం, పని గంటలు వంటి కార్మిక హక్కులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాలు సేకరిస్తోంది. కనీస వేతనాలు ఖరారుకు ఆరు ప్రమాణాలను నిర్ణయించింది. ఈ మేరకు కార్మిక శాఖ వివిధ రంగాల్లో పని చేస్తోన్న కార్మికులు, ఉద్యోగులు తమ అభిప్రాయాలను ఈ నెలాఖరులోగా తెలియజేయాలని ఈ-మెయిల్ ద్వారా పంపించాలని వెల్లడించింది.

విరామం ఎంత ఇచ్చినా 12 గంటలు దాటవద్దు...

విరామం ఎంత ఇచ్చినా 12 గంటలు దాటవద్దు...

ప్రస్తుత చట్టాల ప్రకారం ఎనిమిది గంటలు పని చేస్తే ఒక రోజు వర్కింగ్ డేగా లెక్కిస్తున్నారు. అదనంగా భోజన విరామం అరగంట పరిగణలోకి తీసుకుంటే ఎనిమిదిన్నర గంటలు అవుతోంది. కానీ వేతన కోడ్‌లో భాగంగా సాధారణ పని రోజును 9 గంటలుగా పేర్కొంది. ఏదైనా విరామ సమయం ఎక్కువగా ఇచ్చినా రోజుకు 12 గంటలు దాటి వర్కింగ్ డేగా ఉండటానికి వీల్లేదని పేర్కొంది.

అభిప్రాయాలు చెప్పవచ్చు ఇలా..

అభిప్రాయాలు చెప్పవచ్చు ఇలా..

రోజుకు 8 గంటల నుంచి 9 గంటలకు పెంపు సహా వివిధ కార్మిక ప్రమాణాలకు సంబంధించి అభిప్రాయం చెప్పవచ్చు. ఇందుకు వివిధ రంగాలలో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులు.... కార్మిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజీవ్ రంజన్ ([email protected]), అసిస్టెంట్ డైరెక్టర్ బికాశ్ కుమార్ మాలిక్ ([email protected]) మెయిల్స్‌కు తమ అభిప్రాయాలు పంపించవచ్చు.

డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి...

English summary

మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం: రోజుకు 9 గంటలు వర్కింగ్ హవర్స్, 12 గంటలు మించొద్దు.. | Draft Notification issued by Ministry of Labour and Employment

The Ministry of Labour and Employment has prepared a preliminary draft rule under Section 67 of the Code on Wages, 2019.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X