For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్లీజ్..ప్లీజ్... మారటోరియం పొడగించొద్దు, ఆర్బీఐకి హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ వినతి...

|

రుణానికి సంబంధించి మారటోరియం పొడగించొద్దు అని హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్ ఆర్బీఐని కోరారు. మరోసారి పొడగిస్తే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందన్నారు. రుణం తీసుకున్న వారు చెల్లించే స్థోమత ఉన్నా.. మారటోరియం విధించడం వల్ల చెల్లించడం లేదన్నారు. రుణం చెల్లించే అంశాన్ని అవకాశం మలచుకొని పే చేయడం లేదన్నారు. ఆగస్టులో మారటోరియాన్ని ఎట్టి పరిస్థితుల్లో పొడగించొద్దు అని సూచించారు.

దీపక్ పరేఖ్ కామెంట్లపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. మారటోరియం విధించడం వల్ల జరుగుతోన్న పరిస్థితులను ఆయన ప్రస్తావించారని.. తాను నోట్ చేసుకున్నానని తెలిపారు. అయితే కామెంట్లపై ఇప్పుడే వ్యాఖ్యానించలేని తెలిపారు. దీనిపై సీఐఐ సభ్యులతో మాట్లాడుతానని చెప్పారు.

Dont extend loan moratorium, it is being misused, Deepak Parekh urges RBI..

కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ విధించడంతో వేతన జీవుల కష్టాలను గుర్తుంచుకొని ఆర్బీఐ మారటోరియం విధించింది. తొలుత మార్చిలో 3 నెలలు విధిస్తున్నట్టు ప్రకటించింది. అయినప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో మరో మూడు నెలలు కంటిన్యూ చేసింది. అయితే మరో 3 నెలల పొడగింపుపై చర్చ జరుగుతోందని.. అందుకే తాను ఆర్బీఐని కోరినట్టు పరేఖ్ తెలిపారు. ఇదీ ముఖ్యంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు.

ఆగస్టుతో గడువు ముగియనుండగా.. రుణం తీసుకున్నవారు, హౌస్ లోన్లు వారు మరోసారి ఆశగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో మరోసారి మారటోరియం పొడగించొద్దని పరేఖ్ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.

English summary

ప్లీజ్..ప్లీజ్... మారటోరియం పొడగించొద్దు, ఆర్బీఐకి హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ వినతి... | Don't extend loan moratorium, it is being misused, Deepak Parekh urges RBI..

HDFC chairman Deepak Parekh on Monday made strong plea to Reserve Bank of India not to extend the moratorium beyond August.
Story first published: Monday, July 27, 2020, 16:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X