ఇటీవల కరోనా వైరస్ ప్రభావంతో ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్నవేళ మొన్నటి వరకు ఊహించని విధంగా ఒడిదుడుకులకు లోనైన దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఇక సోమవారం నుండి వరుసగా లాభాల్లో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఏడు వారాల గరిష్టానికి చేరింది . ఆరంభం నుంచీ పటిష్టంగా కదలాడిన కీలకసూచీలు వరుసగా మూడో రోజుకూడా లాభపడి ప్రధాన మద్దతు స్థాయిలకు పైన ముగిసింది . దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ లకు బూస్ట్ ఇచ్చి నట్టయింది .అయితే ఈ ట్రెండ్ కొనసాగుతుందా అన్న అనుమానాలు లేకపోలేదు .

లాభాల్లో స్టాక్ మార్కెట్ .. సెన్సెక్స్ 606 పాయింట్లు, నిఫ్టీ 172పాయింట్లు లాభం
సెన్సెక్స్ 606 పాయింట్లు ఎగిసి 32720వద్ద, నిఫ్టీ 172పాయింట్లు లాభపడి 9553 వద్ద స్థిరంగా ముగిశాయి. ఆఖరి గంటలో మరింత పుంజుకున్ననిఫ్టీ 9550 స్థాయికి ఎగువన ముగిసింది. అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిశాయి. డాలరు మారకంలో 3 వారాల గరిష్ట స్థాయిని తాకింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో సానుకూల సంకేతాల, డాలరు బలహీనత నేపథ్యంలో మంగళవారం నాటి ముగింపు 76.19 తో పోలిస్తే రూపాయి 76 స్థాయికి ఎగువకు చేరింది. ఆరంభంలోనే 35 పైసలు ఎగిసింది. చివరికి 52 పైసల లాభంతో 75.67 వద్ద ముగిసింది.

మార్కెట్లకు మద్దతునిచ్చిన మెటల్, బ్యాంకింగ్, ఆటో, ఫార్మా లాభాలు
ఇక ముఖ్యంగా మెటల్, బ్యాంకింగ్, ఆటో, ఫార్మా లాభాలు మార్కెట్లకు మద్దతు నిచ్చాయి. సెన్సెక్స్ 783 పాయింట్లు పెరిగి ఇంట్రాడేలో 32,898 గరిష్ట స్థాయిని తాకింది. కాగా రేపు డెరివేటివ్ సిరీస్ ముగియనుంది. ఇక మెటల్ 4.5శాతం, ఆటో 2 శాతం, పీఎస్‌యు బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్ ఒక్కొక్కటి 1.8 శాతం, మీడియా 1.7శాతం, ఐటీ, రియాల్టీ రంగాలు 1.3శాతం పైకి ఎగిశాయి . ఇక ఫావిపిరవిర్ ఔషధాన్ని సొంతంగా అభివృద్ధి చేసినట్లు స్ట్రైడ్స్ ఫార్మా ప్రకటించడంతో ఈ షేరు 20 శాతం లాభపడింది.

చమురు ధరల బలం, డాలరు బలహీనం నేపథ్యం.. దేశీయ కరెన్సీకి పాజిటివ్
అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి కూడా పాజిటివ్ గా ముగిసింది. చమురు ధరల బలం, డాలరు బలహీనం నేపథ్యంతో ఆరంభంలోనే 35 పైసలు ఎగిసి మూడువారాల గరిష్టాన్ని తాకింది. ఇక టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, గెయిల్ అదానీ, హెచ్‌డిఎఫ్‌సి, జెఎస్‌డబ్ల్యు స్టీల్, హీరోమోటోకార్ప్ టాప్ విన్నర్స్ గా వుండగా, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఏషియన్ పెయింట్స్ ఈ రోజు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.

కరోనా సంక్షోభం తో మార్కెట్ ట్రెండ్ పై అనుమానాలు
కరోనా వైరస్ సంక్షోభంతో రూపాయి పతనమైందనీ, ఈ నష్టాల నుంచి కొంత విరామం ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి రూపాయి పాజిటివ్ ధోరణి నిలబడుతుందా లేదా అనేది అంచనా వేయాల్సి వుంది. ఈ దూకుడు కొనసాగదని, అందుకు రూపాయి నిలకడగా ఉండలేని స్థితి కారణం అనే అభిప్రాయాలు ఉన్న వేళ స్టాక్ మార్కెట్ లాభాల బాటపై పలు అనుమానాలు ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో పతనం దిశగా పయనం సాగుతుందేమో అన్న అనుమానాలు లేకపోలేదు .
More From GoodReturns

భారత స్టాక్ మార్కెట్: ద్రవ్యోల్బణం డేటాతో భారీ కుదుపులు తప్పవా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

ద్రవ్యోల్బణం గణాంకాలతో నేడు స్టాక్ మార్కెట్ భారీ మలుపు?

స్టాక్ మార్కెట్లలో ఈ వారం భారీ యాక్షన్, ఇన్వెస్టర్లు సిద్ధమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

స్టాక్ మార్కెట్ సెలవు: బుధవారం భారీ యాక్షన్ గ్యారెంటీనా?

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?

విప్రో ఫలితాల వేళ ఇన్వెస్టర్లకు భారీ షాక్ తప్పదా?

Paskistan: పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ! చర్చలు విఫలం కావడంతో రూ. 78,000 కోట్లు గల్లంతు! ఎలాగంటే..

Stock market: వర్షం పడితేనే స్టాక్ మార్కెట్లో లాభాల పంట! మాన్సూన్ ఎఫెక్ట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..



Click it and Unblock the Notifications