For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశీయ విమానాలు బంద్: విమానయాన శాఖ కీలక నిర్ణయం

|

కరోనా కల్లోలం నేపథ్యంలో ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25వ తేదీ నుండి దేశీయ విమానా సర్వీసులను రద్దు చేసింది. సరుకు రవాణా విమానాలకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. అంటే విమానాలు మంగళవారం అర్ధరాత్రి నుండే క్యాన్సిల్ అవుతున్నాయి. ఆ లోపు అంటే అర్ధరాత్రి గం.11.59 సమయానికి గమ్య స్థానాలకు చేరుకునేలా విమానయాన సంస్థలు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించింది.

తదుపరి ఆదేశాల వరకు విమాన సర్వీసులను నిలిపివేయాలి. ఇప్పటికే అంతర్జాతీయ సర్వీసులను వారం రోజుల పాటు నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 415కు చేరుకున్నాయి. మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. దీంతో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది.

 Domestic flights grounded from tuesday midnight

ఒక్క విమానాన్ని కూడా ఢిల్లీకి అనుమతించేది లేదని ఆదివారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే నిర్దేశించిన గడువు వరకు సేవల్లో ఎలాంటి మార్పులు లేవని పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది.

English summary

దేశీయ విమానాలు బంద్: విమానయాన శాఖ కీలక నిర్ణయం | Domestic flights grounded from tuesday midnight

Domestic commercial airlines shall cease operations with effective from tomorrow midnight, that is 23.59 hours IST on 24/3/2020. Airlines have to plan operations so as to land at their destinations before this time.
Story first published: Monday, March 23, 2020, 17:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X