For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాక్‌టెయిల్ థెరపీ క్లెయిమ్స్‌ను తిరస్కరించవద్దు: Irdai ఆదేశాలు

|

కరోనా చికిత్సలో భాగంగా యాంటీ బాడీ కాక్ టెయిల్ థెరపీకి ఆరోగ్య బీమా వర్తిస్తుందని ఇన్సురెన్స్ రెగ్యులేటర్ ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(Irdai) బీమా సంస్థలకు స్పష్టే చేసింది. బీమా సంస్థలు ఈ చికిత్సను ప్రయోగాత్మకంగా పేర్కొంటూ, క్లెయిమ్స్‌ను తిరస్కరించకూడదని సూచించింది. ఈ చికిత్స తీసుకున్న వారికి క్లెయిమ్ ఇవ్వడం లేదని లేదా ఆ చికిత్స ఖర్చును మినహాయించి మిగతా మొత్తం చెల్లిస్తున్నారని ఇటీవలి కాలంలో నియంత్రణ సంస్థకు ఫిర్యాదులు వచ్చాయి.

ఈ నేపథ్యంలో Irdai సాధారణ, ఆరోగ్య బీమా సంస్థల సీఎండీ, సీఈవోలకు ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. యాంటీ బాడీ కాక్ టెయిల్ చికిత్సకు సీడీఎస్‌సీవో అత్యవసర వినియోగం కోసం అనుమతిచ్చిందని, ఈ నేపథ్యంలో క్లెయిమ్స్‌ను తిరస్కరించకూడదని తెలిపింది. నిబంధనల ప్రకారం క్లెయిమ్స్ పరిష్కారం జరిగేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.

Do not to deny claims for antibody cocktail therapy to COVID patients

కోవిడ్-19 యాంటీ బాడీ కాక్ టెయిల్ థెరపీ చికిత్స కోసం క్లెయిమ్స్‌ను తిరస్కరించడం లేదా ఖర్చులను తగ్గించడం వంటి సందర్భాలను అధికార యంత్రాంగం చూసిందని, ఈ థెరపీ ప్రయోగాత్మక చికిత్స అనే కారణంతో దీనిని తిరస్కరించినట్లుగా గుర్తించారని Irdai పేర్కొంది.

English summary

కాక్‌టెయిల్ థెరపీ క్లెయిమ్స్‌ను తిరస్కరించవద్దు: Irdai ఆదేశాలు | Do not to deny claims for antibody cocktail therapy to COVID patients

Insurance regulator Irdai has asked the general and health insurance providers not to deny claims against 'antibody cocktail therapy' to COVID patients and devise a mechanism to clear such dues as per the norms.
Story first published: Wednesday, January 12, 2022, 13:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X