For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఏడాది అందరి కంటే ఎక్కువ నష్టపోయింది అంబానీ.. అదానీ కాదు..! మరి ఎవరంటే..?

|

Radhakishan Damani: కొత్త ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి దేశీయ పారిశ్రామికవేత్తలు తమ సంపదను భారీగా కోల్పోతూనే ఉన్నారు. జనవరి చివరిలో గౌతమ్ అదానీ సామ్రాజ్యంపై సంచలన నివేదిక రావడంతో కుప్పకూలటం ప్రారంభమైంది. దీంతో గౌతమ్ అదానీ వేల కోట్ల సంపదను కోల్పోయారు.

కుబేరుల భేజారు..

కుబేరుల భేజారు..

ఆసియా నుంచి కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన అదానీ సంపద ఆవిరి కాగా.. ఆయన తర్వాత అత్యధికంగా నికర ఆస్తుల విలువ క్షీణించిన రెండవ భారతీయుడిగా ముఖేష్ అంబానీ నిలిచారు. ప్రపంచంలోని ధనవంతులందరితో పోలిస్తే 2003లో అదానీ-అంబానీలు అత్యధిక సంపదను కోల్పోయారు. అయితే ఈ జాబితాలో మూడో భారతీయుడి పేరు కూడా చేరింది. దేశీయ రిటైల్ చైన్ దిగ్గజం డీ-మార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ కూడా భారీగా నష్టాన్ని చవిచూశారు.

దమానీ టాప్ వెల్త్ లూజర్..

దమానీ టాప్ వెల్త్ లూజర్..

ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ గా ఉన్న రాధాకిషన్ దమానీ నికర విలువ కూడా ఈ ఏడాది ఇప్పటివరకు భారీ క్షీణతను నమోదు చేసింది. జనవరి 1, 2023 నుంచి ఇప్పటి వరకు ఆయన సంపదలో రూ.22,143 కోట్లను కోల్పోయారు. ఈ కారణంగా ఆయన టాప్ వెల్త్ లూజర్ల జాబితాలో నిలిచారు. దీంతో 2023లో అత్యధిక సంపదను కోల్పోయిన భారతీయ బిలియనీర్ల జాబితాలో రాధాకిషన్ దమానీ పేరు మూడో స్థానంలో ఉంది.

ముంబై బెస్ట్ బిలియనీర్..

ముంబై బెస్ట్ బిలియనీర్..

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం రాధాకిషన్ దమానీ భారీ మొత్తాన్ని కోల్పోయిన తర్వాత 16.7 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు. దీంతో కుబేరుల జాబితాలో ఆయన 97వ స్థానంలో నిలిచారు. కొత్త ఏడాది దమానీ తన నికర విలువలో దాదాపు 14 శాతాన్ని కోల్పోయారు. ముంబై బెస్ట్ బిలియనీర్ రాధాకిషన్ దమానీకి దేశవ్యాప్తంగా మెుత్తం 238 ప్రదేశాల్లో డీమార్ట్ చైన్ కింద రిటైల్ స్టోర్లను కలిగి ఉన్నారు. ఈయన దివంగత రాకేష్ జున్ జున్ వాలాకు గురువని మనలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

30వ స్థానానికి అదానీ..

30వ స్థానానికి అదానీ..

2022లో గౌతమ్ అదానీ అసాధ్యమనుకున్న అతిపెద్ద రికార్డును సాధించారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో మూడో స్థానానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే హిండెన్ బెర్గ్ నివేదిక తర్వాత క్రమంగా ఆయన సంపద కరిగిపోవటంతో టాప్-10 నుంచి నిష్క్రమించారు. ప్రస్తుతం ఆయన సంపద తరిగిపోవటంతో 30వ స్థానానికి పరిమితమయ్యారు.

అంబానీ నష్టాలు..

అంబానీ నష్టాలు..

2023లో రిలయన్స్ ఛైర్మన్, ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ సంపద నష్టంలో రెండవ స్థానంలో ఉన్నారు. రెండు నెలల లోపే 5.38 బిలియన్ డాలర్లు (రూ. 44,618 కోట్లకు పైగా) నష్టం వాటిల్లింది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం అంబానీ 81.7 బిలియన్ డాలర్ల నికర సంపదతో టాప్-10 బిలియనీర్ల జాబితాలో 10వ స్థానంలో కొనసాగుతున్నారు.

English summary

ఈ ఏడాది అందరి కంటే ఎక్కువ నష్టపోయింది అంబానీ.. అదానీ కాదు..! మరి ఎవరంటే..? | Dmart owner Damani lost wealth heavily after Gautam Adani and Mukesh Ambani

Dmart owner Damani lost wealth heavily after Gautam Adani and Mukesh Ambani
Story first published: Monday, February 27, 2023, 11:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X