For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Real Estate: రియల్టీ దిగ్గజం రికార్డు అమ్మకాలు.. మూడు రోజుల్లో రూ.8,000 కోట్ల సేల్స్..

|

Real Estate: కరోనా తర్వాత ఇటీవలి కాలంలో రియల్టీ రంగం శరవేగంగా దూసుకుపోతోంది. గతంలో ఎన్నడూ చూడని రికార్డులను నమోదు చేస్తోంది. ప్రజలు ఇల్లు కొనాలని చేస్తున్న ప్రయత్నాలు కంపెనీలకు కాసుల పంట కురిపిస్తున్నాయి.

రికార్డు అమ్మకాలు..

రికార్డు అమ్మకాలు..

దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ DLF లగ్జరీ హైరైజ్ నివాసాలైన ది ఆర్బర్ కోసం రూ.8,000 కోట్లకు పైగా ప్రీ-ఫార్మల్ లాంచ్ అమ్మకాలను రికార్డ్ చేసింది. సంస్థ ఈ కాంప్లెక్స్‌ను గురుగ్రామ్‌లోని సెక్టార్ 63 గోల్ఫ్ కోర్స్ ఎక్స్‌టెన్షన్‌లో నిర్మిస్తోంది. అధికారికంగా ప్రాజెక్టు ప్రారంభించక ముందే కంపెనీ ఫ్లాట్లను పూర్తిగా విక్రయించింది.

 ప్రాజెక్టు ప్రత్యేకతలు..

ప్రాజెక్టు ప్రత్యేకతలు..

25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సంపన్నమైన పరిసరాల్లో 38 లేదా 39 అంతస్తులు కలిగి ఉండే విధంగా ఐదు నిర్మాణాలను కంపెనీ ఈ ప్రాజెక్ట్ కింద చేపట్టనుంది. దీని కింద దాదాపు 1137 ప్లాట్లు నిర్మించబడనున్నాయి. ఒక్కో ఫ్లాట్ నాలుగు బెడ్ రూమ్స్, స్టడీ రూమ్, యుటిలిటీ రూమ్ కలిగి ఉంటాయి. దీని ధరలు రూ.7 కోట్ల నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది.

కంపెనీ స్పందన..

కంపెనీ స్పందన..

'ది ఆర్బర్' ప్రాజెక్టును ప్రారంభించటానికి ముందే అద్బుతమైన స్పందనను అందుకోవటంపై DLF Ltd గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆకాష్ ఓహ్రి సంతోషం వ్యక్తం చేశారు. ఇది బహుశా లగ్జరీ రియల్ ఎస్టేట్ విభాగంలో కొత్త టచ్‌స్టోన్ అని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టులో దాదాపు 95 శాతం కొనుగోలుదారులు తమ నివాసం కోసం ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు.


English summary

Real Estate: రియల్టీ దిగ్గజం రికార్డు అమ్మకాలు.. మూడు రోజుల్లో రూ.8,000 కోట్ల సేల్స్.. | DLF did record sale of 8000 crores by luxury appartments selling even before project starts

DLF did record sale of 8000 crores by luxury appartments selling even before project starts
Story first published: Thursday, March 16, 2023, 11:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X