For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Dividend Vs Growth: మ్యూచువల్ ఫండ్లలో డివిడెండ్, గ్రోత్ ఆప్షన్ లో ఏది బెటర్..?

|

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారు గణనీయంగా పెరిగారు. అయితే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడిదారుల కోసం రెండు రకాల ఎంపికలు ఉన్నాయి. అందులో ఒకటి డివిడెండ్ కాగా మరొకటి గ్రోత్ ఆప్షన్. పెట్టుబడిదారులు తమ పెట్టుబడి లక్ష్యం ఆధారంగా ఏదైనా ఎంపికను ఎంచుకోవాలని నిపుణులు అంటున్నారు. రెండు ఎంపికలలో దేనినైనా ఎంచుకునే ముందు పన్ను చిక్కులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

గ్రోత్ ఎంపికను ఎవరు ఎంచుకోవాలి?

గ్రోత్ ఎంపికను ఎవరు ఎంచుకోవాలి?

డబ్బు అవసరం లేని పెట్టుబడిదారులు గ్రోత్ ఆప్షన్ లో పెట్టుబడి పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. స్కీమ్‌లో లాభాలను తిరిగి పెట్టుబడి పెట్టడం వలన వృద్ధి ఎంపికలలో NAV ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడిదారులు లాభంపై లాభాలను పొందవచ్చు. తద్వారా ఎక్కువ రాబడిని పొందొచ్చు. డివిడెండ్ ఎంపికలతో పోల్చితే మొత్తం రాబడులు సాధారణంగా ఉంటాయి.

సుదీర్ఘ పెట్టుబడికి..

సుదీర్ఘ పెట్టుబడికి..

సుదీర్ఘ పెట్టుబడి హోరిజోన్, రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్న పెట్టుబడిదారుల కోసం గ్రోత్ ఆప్షన్ మంచిదని నిపుణులు సూచించారు. సంపదను సృష్టించాలనుకునే పెట్టుబడిదారులకు కూడా ఈ ఎంపిక సరిపోతుందన్నారు."యువ పెట్టుబడిదారులు ఈ ఎంపికకు మరింత అనుకూలంగా ఉంటుందని తెలిపారు.

డివిడెండ్ ఎంపికను ఎవరు ఎంచుకోవాలి?

డివిడెండ్ ఎంపికను ఎవరు ఎంచుకోవాలి?

తమ పెట్టుబడి నుంచి క్రమం తప్పకుండా డబ్బు అవసరమయ్యే పెట్టుబడిదారులు డివిడెండ్ ఎంపికలలో పెట్టుబడి పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే, డివిడెండ్ ఎంపికలో పోస్ట్-డివిడెండ్ NAV తక్కువగా ఉండవచ్చు.పదవీ విరమణ పొందిన, ఇకపై సంపాదించని పెట్టుబడిదారులకు డివిడెండ్ ఎంపిక మంచిదని నిపుణులు చెబుతున్నారు.20-30% ఆదాయ బ్రాకెట్‌లో ఉన్న వ్యక్తులకు డివిడెండ్ ఎంపిక సరిపోతుందన్నారు.

పన్ను చిక్కులు

పన్ను చిక్కులు

డివిడెండ్ ఎంపిక పెట్టుబడిదారుకు ఆదాయ స్లాబ్ రేట్ల ప్రకారం పన్ను విధిస్తారు. అయితే ఫండ్‌ను రీడీమ్ చేయడం ద్వారా గ్రోత్ ఎంపికకు పన్ను చిక్కులు మొదలవుతాయి.డివిడెండ్ ఆదాయం నుంచి 10% TDSని తప్పనిసరిగా మినహాయించాలని ఆదాయపు పన్ను చట్టం వివరిస్తుంది. వ్యక్తిగత యూనిట్ హోల్డర్‌కు ఆర్థిక సంవత్సరంలో పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లయితే, రూ. 5,000కు మించకుండా TDS తీసివేయరు

English summary

Dividend Vs Growth: మ్యూచువల్ ఫండ్లలో డివిడెండ్, గ్రోత్ ఆప్షన్ లో ఏది బెటర్..? | Dividend, Growth which option better to mutual fund investor

There are two broad types of options for mutual fund investors – Dividend and Growth.
Story first published: Saturday, July 23, 2022, 11:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X