ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (జూన్ 25, గురువారం) పెరిగాయి. చమురు రంగ కంపెనీలు వరుసగా 19వ రోజు ధరలను పెంచాయి. ఈ రోజు లీటర్ డీజిల్ పైన 14 పైసలు, లీటర్ పెట్రోల్ పైన 16 పైసలు పెరిగింది. లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలల పాటు చమురురంగ సంస్థలు ధరలను సమీక్షించలేదు. జూన్ 7వ తేదీ నుండి సమీక్ష ప్రారంభించాయి. అప్పటి నుండి పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజు పెరుగుతున్నాయి. పెట్రోల్ ధర నిన్న ఒక్కరోజు పెరగలేదు. మళ్లీ నేడు పెరిగింది.

వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో నేడు లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ పైన ధరలు ఇలా ఉన్నాయి...
న్యూఢిల్లీ: పెట్రోల్ రూ.79.92, డీజిల్ రూ.80.02
గుర్గావ్: పెట్రోల్ రూ.78.15, డీజిల్ రూ.72.31
ముంబై: పెట్రోల్ రూ.86.70, డీజిల్ రూ.78.34
చెన్నై: పెట్రోల్ రూ.83.18, డీజిల్ రూ.77.29
హైదరాబాద్: పెట్రోల్ రూ.82.96, డీజిల్ రూ.78.19
బెంగళూరు: పెట్రోల్ రూ.82.52, డీజిల్ రూ.76.09

ఢిల్లీలో రూ.80 దాటిన డీజిల్, పెట్రోల్ రూ.80
ఢిల్లీలో నిన్నటితోనే పెట్రోల్ కంటే డీజిల్ ధర పైకి చేరుకుంది. నిన్న పెట్రోల్ ధర పెరగలేదు. డీజిల్ ధర 48 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ రేటును క్రాస్ చేసింది. నేడు రెండింటి ధరలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో డీజిల్ ధర రూ.80 దాటితే, పెట్రోల్ ధర రూ.80 కంటే 8 పైసలు తక్కువగా ఉంది.

ఇరవై రోజుల్లో రూ.10 పెరుగుదల
జూన్ 7వ తేదీ నుండి వరుసగా 19 రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. దీంతో లీటర్ డీజిల్ ధర రూ.10.63, లీటర్ పెట్రోల్ ధర రూ.8.21 పెరిగింది. మరోవైపు గత కొద్దిరోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న పెట్రోల్ ధరలు ఇప్పుడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కరోనా రెండోసారి విజృంభిస్తుందనే ఆందోళనల నేపథ్యంలో క్రూడ్ రెండు డాలర్లు పడిపోయింది.

ఢిల్లీలో పెట్రోల్ ధర కంటే డీజిల్ ధర ఎందుకు ఎక్కువ?
ఢిల్లీలో పెట్రోల్ ధర కంటే డీజిల్ ధర ఎక్కువ ఉండటంపై ఐవోసీ (ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్) చైర్మన్ సంజీవ్ సింగ్ స్పందించారు. ఇతర నగరాలు, రాష్ట్రాల్లో వ్యాట్ తక్కువగా ఉందని, కానీ ఢిల్లీలో డీజిల్ పైన వ్యాట్ ఎక్కువగా ఉందని చెప్పారు. ఇటీవల పెట్రోల్ పైన వ్యాట్ 27 శాతం నుండి 30 శాతానికి, డీజిల్ పైన 16.75 శాతం నుండి 30 శాతానికి పెంచిందని గుర్తు చేశారు. ఇతర నగరాల్లో పెట్రోల్‌తో పోలిస్తే డీజిల్ ధర తక్కువగా ఉందన్నారు.
More From GoodReturns

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications