For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్, భారీగా పెరిగిన డెత్ క్లెయిమ్స్

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో లైఫ్ ఇన్సురెన్స్ క్లెయిమ్స్ భారీగా పెరుగుతున్నాయి. ప్రభుత్వరంగ లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో డెత్ క్లెయిమ్స్ గత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి తొమ్మిది నెలలకు గాను ఎనిమిది లక్షల మార్కును దాటాయి. ఇక అంతకుముందు ఏడాది (2019-20) ఇదే కాలంతో పోలిస్తే 17 శాతం పెరిగి 8,16,652 క్లెయిమ్స్ నమోదయ్యాయి. అంతకుముందు మూడేళ్లు తగ్గుతూ వచ్చిన క్లెయిమ్స్ కరోనా నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం పెరిగాయి.

'బిట్ కాయిన్ ఆ ఒక్క కారణంతో కొనుగోలు చేస్తారు, నేను ఈ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయను''బిట్ కాయిన్ ఆ ఒక్క కారణంతో కొనుగోలు చేస్తారు, నేను ఈ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయను'

డెత్ క్లెయిమ్స్ జంప్

డెత్ క్లెయిమ్స్ జంప్

2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో ఎల్ఐసీ 8,08,575 డెత్ క్లెయిమ్స్‌ను పరిష్కరించింది. వీటి వ్యాల్యూ మొత్తం రూ.రూ.16,946 కోట్లు. ఇందులో గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ కాలంలో డెత్ క్లెయిమ్స్ కింద ఎల్ఐసీ చెల్లించిన మొత్తం దాదాపు రూ.7,540 కోట్లు. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 81 శాతం అధికం.

అంతకుముందు సంవత్సరాల్లో పెరుగుదల 5శాతం నుండి 8 శాతం కాగా, ఇది చాలా ఎక్కువ.అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2020-21 ఏడాది మొదటి 9 నెలల కాలంలో ఎల్ఐసీ డెత్ క్లెయిమ్స్ మొత్తం దాదాపు 32 శాతం పెరిగాయి. అంతకుముందు సంవత్సరం ఈ పెరుగుదల రెండు శాతం.

ఈ కంపెనీల్లోను..

ఈ కంపెనీల్లోను..

2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలలకు లైఫ్ ఇన్సురెన్స్ రంగంలోని మొత్తం డెత్ క్లెయిమ్స్ వ్యాల్యూ 36 శాతం పెరిగింది. ఎల్ఐసీ తర్వాత ప్రయివేటు రంగంలో ఎస్బీఐ లైఫ్‌లో 9 నెలలకు అత్యధికంగా డెత్ క్లెయిమ్స్ వ్యాల్యూ 58 శాతం వరకు పెరిగింది. ఈ కాలంలో డెత్ క్లెయిమ్స్ సంఖ్య 23,400 కు చేరుకుంది. ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ వంటి సంస్థల డెత్ క్లెయిమ్స్ కూడా భారీగానే పెరిగాయి.

ఉద్యోగులకు వోల్వో ఇండియా ఊరట

ఉద్యోగులకు వోల్వో ఇండియా ఊరట

ఇదిలా ఉండగా, వోల్వో కార్ ఇండియా తన ఉద్యోగులకు కరోనా టర్మ్ ఇన్సురెన్స్ కవరేజీని రూ.10 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ అందరినీ వణికిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ కంపెనీలు తమ ఉద్యోగులకు వివిధ రూపాల్లో అండగా నిలుస్తున్నాయి. ఈ కంపెనీకి దేశంలో 25 డీలర్‌షిప్స్ ఉండగా, ఇక్కడి ఉద్యోగులకు టర్మ్ ఇన్సురెన్స్ వర్తిస్తుంది.

English summary

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్, భారీగా పెరిగిన డెత్ క్లెయిమ్స్ | Death Claim increased in second wave of Corona

Death Claim increased in second wave of Corona. India recorded a dip in daily cases and logged 3,741 deaths in 24 hours, according to health ministry's updated data on Sunday.
Story first published: Sunday, May 23, 2021, 10:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X