For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెల్కోల కష్టాలపై DCC సమావేశం, వొడాఫోన్ ఐడియా ఛార్జీల పెంపు వ్యూహం వెనుక..

|

వొడాఫోన్ ఐడియా, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) విజ్ఞాపన లేఖలు, టెల్కోలు ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో కంపెనీలకు ఎలాంటి ఉపశమన చర్యలు ప్రకటించాలనే అంశంపై శుక్రవారం (ఫిబ్రవరి 28) డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (DCC) సమావేశమయ్యే అవకాశముంది. బకాయిలను విడతలవారీగా చెల్లించేందుకు వీలు కల్పించడం సహా వివిధ అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది.

రూ.2,000 నోటుపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలురూ.2,000 నోటుపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

వొడాఫోన్ ఐడియా ఛార్జీలు పెంచమనేది అందుకే
టెలికం కంపెనీలు టారిఫ్స్‌ను డిసెంబర్‌లో 50% మేర పెంచాయి. ఇప్పుడు మరోసారి పెంచాలని వొడాఫోన్ ఐడియా కోరడం గమనార్హం. డేటా, కాల్ రేట్లను మళ్లీ పెంచితే 2015-16లో వొడాఫోన్ ఐడియాలు ఎంత అయితే ఆదాయాన్ని ఆర్జించేవో ఆ మేరకు ఆదాయాన్ని మూడేళ్ల తర్వాత ఆర్జించవచ్చునని కంపెనీ భావిస్తోంది. అందుకే బకాయిల చెల్లింపుకు మూడేళ్ల మారటోరియం అడిగిందని చెబుతున్నారు. అయితే వొడాఫోన్ ఐడియా డిమాండ్లను ప్రభుత్వం ప్రస్తుతం తీర్చే పరిస్థితి లేదంటున్నారు.

DCC may discuss telcos AGR issue on Friday

ఏజీఆర్ సహా ఇతర బకాయిలు రూ.1.47 ట్రిలియన్లను ప్రభుత్వానికి చెల్లించాలని టెల్కోలను సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో ఎక్కువ భాగం వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కంపెనీలవే ఉన్నాయి. భారతీ ఎయిర్ టెల్ రూ.35,500 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.50,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. అసలే జియోతో పోటీ కారణంగా టారిఫ్ తగ్గి ఆర్థిక నష్టాల్లో ఉన్న టెల్కోలకు ఇది మరింత గుదిబండగా మారింది.

English summary

టెల్కోల కష్టాలపై DCC సమావేశం, వొడాఫోన్ ఐడియా ఛార్జీల పెంపు వ్యూహం వెనుక.. | DCC may discuss telcos AGR issue on Friday

The Digital Communications Commission, the apex decision making body in the telecom sector, is expected to meet on Friday to deliberate on a relief package for the financially stressed industry.
Story first published: Friday, February 28, 2020, 8:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X