For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

70 లక్షల భారతీయుల క్రెడిట్, డెబిట్ కార్డు హోల్డర్లకు షాక్, ఫోన్ నెంబర్లు కూడా లీక్

|

70 లక్షల మంది ఇండియన్ డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్లక్ షాక్! ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రస్‌లు సహా ఈ కార్డు హోల్డర్ల వ్యక్తిగత వివరాలు డార్క్ వెబ్‌లో లీక్ అయ్యాయి. ఇంటర్నెట్ సెక్యూరిటీ రీసెర్చర్ ఈ మేరకు అలర్ట్ చేశారు. ఈ లీకైన వివరాల్లో యూజర్ల పేర్లు, యాజమాన్యాల పేర్లు, ఏడాది ఆదాయం వంటి వివరాలు కూడా లీకైనట్లు సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రాజాహారియా తెలిపారు.

లీకైన డేటాలో భారతీయ క్రెడిట్, డెబిట్ కార్డు కస్టమర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఆదాయ వివరాలు, ఖాతా వివరాలు సహా మరికొన్ని ఉన్నాయి. బయటకు వచ్చిన డేటాలో 2010 నుండి 2019 వరకు గల కస్టమర్ల సమాచారం ఉంది. లీకైన డేటా బేస్ సైజ్ 2GB. అంతేకాదు, యూజర్ల అకౌంట్ రకం, వారు మొబైల్ అలర్ట్స్ స్విచ్చాఫ్ చేసుకున్నారా లేదా వంటి వివరాలు కూడా ఉన్నాయి. ఇది ఫైనాన్షియల్ డేటా కాబట్టి సైబర్ నేరాలు, మోసాలు, ఫిషింగ్ దాడులు, ఆన్‌లైన్ మోసాలకు ఉపయోగించవచ్చునని అంటున్నారు

Data of 70 Lakh Indian Debit, Credit Cardholders Leaked on Dark Web

బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్న థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్ల నుండి ఇది వెలుగు చూడవచ్చునని అంటున్నారు. లీకైన డేటా బేస్‌లో ఐదు లక్షల మంది కార్డు హోల్డర్ల పాన్ నెంబర్లు కూడా ఉన్నాయట. ఈ డేటాలో యాక్సిస్ బ్యాంకు, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, కెల్లాగ్, మెకెన్సీ అండ్ కంపెనీలో పని చేసే ఉద్యోగులతో పాటు మరింతమంది సమాచారం ఉండవచ్చునని ఇంక్ 42 తన నివేదికలో తెలిపింది. వీరి ఏడాది వేతనం రూ.7 లక్షల నుండి రూ.75 లక్షల మధ్య ఉంది.

English summary

70 లక్షల భారతీయుల క్రెడిట్, డెబిట్ కార్డు హోల్డర్లకు షాక్, ఫోన్ నెంబర్లు కూడా లీక్ | Data of 70 Lakh Indian Debit, Credit Cardholders Leaked on Dark Web

The credit and debit card details of 70 lakh Indians have been leaked on the dark web. As per a cybersecurity researcher, the sensitive data of Indian users that have been leaked include cardholders' names, phone numbers, income details, account details, and more.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X