60,000 డాలర్ల వద్ద బిట్ కాయిన్, 300 శాతం లాభపడిన SQUID
గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ క్రితం సెషన్‌లో 0.07 శాతం లాభపడి 2.64 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇరవై నాలుగు గంటల్లో మొత్తం క్రిప్టో కరెన్సీ మార్కెట్ వ్యాల్యూమ్ 143.78 బిలియన్ డాలర్లుగా నమోదయింది. ఇది 15.20 శాతం వృద్ధి. ప్రస్తుతం బిట్ కాయిన్ వ్యాల్యూ 60,657.40 డాలర్ల వద్ద ఉంది. భారత కరెన్సీలో రూ.45,22,357.59. స్క్విడ్ గేమ్ క్రిప్టో కరెన్సీ SQUID ఒక్కరోజే 300 శాతం లాభపడింది.
బిట్ కాయిన్ మే నెలలో మొదటిసారి 65వేల డాలర్లకు చేరుకొని, ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అప్పుడు లాభపడుతూ వచ్చిన బిట్ కాయిన్, ఆ తర్వాత కొద్ది నెలలపాటు ఊగిసలాటలో ఉంది. ఆ తర్వాత జూలై నెలలో 30,000 డాలర్ల దిగువకు కూడా పడిపోయింది. అక్కడి నుండి స్వల్పంగా లాభపడుతూ కొద్ది నెలల పాటు 30,000 డాలర్ల నుండి 50,000 డాలర్ల మధ్య కదలాడింది. ఈ నెల కాలంలో 50వేల డాలర్లను దాటి, అక్కడి నుండి పరుగులు పెడుతోంది. 55వేల డాలర్లు దాటిన తర్వాత గతవారం సెషన్‌లలోనే 60 వేల మార్కును దాటింది. ఈ వారం 62వేలను దాటి, ఇప్పుడు 66వేల డాలర్లు క్రాస్ చేసింది. ఆ తర్వాత 60వేల స్థాయికి పడిపోయింది.

- Bitcoin - 49,09,833 - 0.02%
- Ethereum - 3,47,514.3 - 0.71%
- Tether - 79.37 - 0.53%
- Cardano - 159.9900 - 1.27%
- Binance Coin - 41,927.20 - మైనస్ 0.2%
- XRP - 87.7400 - 2.61%
- Polkadot - 3,362.04 - మైనస్ 1.69%
- Dogecoin - 21.0087 - మైనస్ 6.87%